Bandla Ganesh : బండ్ల గణేష్ కొడుకుని చూశారా.. బండ్లన్న యంగ్ గా ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడేమో..

బండ్లగణేష్ ప్రస్తుతం తన వ్యాపారాలు చూసుకుంటూ ఇంటివద్దే షాద్ నగర్ లో ఉంటున్నారు. బండ్లగణేష్ కు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు ఉన్నారు. అలాగే ఇటీవలే ఓ చిన్న పాపను కూడా దత్తత తీసుకున్నారు.

Bandla Ganesh son looks like him photo goes viral

Bandla Ganesh :  బండ్ల గణేష్.. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బండ్ల్ గణేష్ కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్లన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

బండ్లగణేష్ ప్రస్తుతం తన వ్యాపారాలు చూసుకుంటూ ఇంటివద్దే షాద్ నగర్ లో ఉంటున్నారు. బండ్లగణేష్ కు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు ఉన్నారు. అలాగే ఇటీవలే ఓ చిన్న పాపను కూడా దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పిల్లల ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా బండ్ల గణేష్ ఇద్దరు అబ్బాయిలు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు.

 

Geetha Subramanyam : ఆహాలో.. సూపర్ హిట్ సిరీస్‌కు మరో సీక్వెల్ త్వరలో..

ఆ స్కూల్ ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో బండ్ల గణేష్ తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నాడు. తన ఇద్దరి కొడుకులతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా గర్వంగా ఉందని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఇద్దరి అబ్బాయిల్లో ఒక అబ్బాయి అచ్చం బండ్ల గణేష్ లాగే ఉన్నాడు. అతన్ని చూస్తుంటే బండ్ల యంగ్ ఏజ్ లో అలాగే ఉండేవాడేమో అన్నట్టు ఉన్నాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు బండ్లన్న లాగే అచ్చు దింపేశాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు.