Basil Joseph : అల్లు అర్జున్ కోసం సినిమాలు మానేస్తున్న మలయాళం స్టార్ హీరో..
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నారు. (Basil Joseph)
- Saketh U
- Published on- November 9, 2026 / 03:27 PM IST
Basil Joseph
Basil Joseph : అల్లు అర్జున్ కోసం మలయాళం స్టార్ హీరో బసిల్ జోసెఫ్ సినిమాల్లో నటించడం ఆపేస్తున్నారట. మలయాళం మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. మలయాళంలో హీరోగా, నటుడిగా అనేక సినిమాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకున్నారు బసిల్ జోసెఫ్. పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యాడు ఈ నటుడు. హీరోగానే కాక దర్శకుడిగా కూడా మూడు సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. ఇటీవల బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు అయ్యాక బసిల్ జోసెఫ్ డైరెక్షన్ లోనే బన్నీ సినిమా ఉండబోతుంది. బన్నీ కోసం పాన్ ఇండియా కథ ప్రీ ప్రొడక్షన్ కోసమే బసిల్ జోసెఫ్ నటుడిగా ప్రయాణం ఆపేస్తున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల్లో నటించి ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యేవరకు హీరోగా, నటుడిగా బసిల్ జోసెఫ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. కొత్త సినిమాలేవీ అంగీకరించట్లేదనే సమాచారం.
Also Read : Sandeep Saroj : రామ్ చరణ్ కి పిచ్చ ఫ్యాన్.. పదేళ్ళప్పుడే మగధీర సినిమా చూసి.. సందీప్ సరోజ్ కామెంట్స్..
బసిల్ జోసెఫ్ తన ఫోకస్ మొత్తం బన్నీ సినిమాపైనే పెట్టాలని, అందుకే నటుడిగా గ్యాప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. నటుడిగా గ్యాప్ తీసుకొని దర్శకుడిగా అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా తీసి భారీ విజయం సాధించడానికి రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ కి మలయాళం లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మలయాళం స్టార్ హీరో, డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ సినిమా అనడంతో కేరళలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
