పదకొండో వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు అనే టాస్క్ చాలా త్రిల్లింగా సాగింది. అయితే దీనికంటే ముందుగా.. ఇంటి సభ్యులంతా కలిసి బిగ్ బాస్ హౌస్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు. పండుగ సందర్భంగా KLM వారు ఇంటి సభ్యుల కోసం పంపించిన కొత్త వేసుకుని బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ.. బతుకమ్మ చుట్టు తిరుగుతూ డ్యాన్స్ చేశారు.
ఇక టాస్క్ విషయానికి వస్తూ.. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తోంది. ఆ సమయంలో ఇంటి సభ్యులు రాళ్లను సొంతం చేసుకుని జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే.. వాళ్లే ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ అవుతారు. ప్రస్తుతానికి మొదటి బజర్ మోగేసరికి రాహుల్ దగ్గర తక్కువ విలువ రాళ్లు ఉండటంతో అతను నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
ఇంకో విషయం ఏంటంటే.. ఇంటి సభ్యులు ఏమైనా తినాలంటే టాస్క లో సంపాదించిన డబ్బుతోనే కొనుక్కొని తినాలి. అగ్గిపెట్టె రూ. 2000, ఉల్లిపాయలు 500, ఉప్పు రూ. 5000 ఇలా భారీ రేట్లకు అమ్మింది శ్రీముఖి. అయితే కేవలం ఉప్పు, అగ్గిపెట్టె కొనుక్కుని జావతోనే సరిపెట్టుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు ఇంకెంత డబ్బుని సంపాదిస్తారో.. టాస్క లో ఎవరు గెలుస్తారో చూడాలి.