Karthikeya : మా ఇమేజ్ డ్యామేజ్ చేయకండి.. హీరో కార్తికేయ ట్వీట్ వైరల్..

నేహా శెట్టితో పాటు తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కార్తికేయ ట్వీట్ ఎవరికి..?

Bedurulanka 2012 Karthikeya tweet on Neha Shetty gone viral

Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కొంచెం గ్యాప్ తీసుకోని ఈ ఏడాది ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కార్తికేయకు జంటగా నటిస్తుంది. ఈ నెల (ఆగష్టు) 25న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో కార్తికేయ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

Double Ismart : డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంజ‌య్ ద‌త్‌..?

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. “RX100 సినిమాతో నాకు, డీజే టిల్లుతో నేహాకి రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి మా జంట మీద కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికీ తగట్టు బెదురులంక రొమాన్స్ ఉంటుంది” అంటూ కార్తికేయ చెప్పుకొచ్చినట్లు ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ కార్తికేయ వరకు వెళ్లడంతో తాను రెస్పాండ్ అయ్యాడు. ఆ వ్యాఖ్యలు తాను మాట్లాడలేదని పేర్కొన్నాడు. “మొత్తం ఇంటర్వ్యూ చూసి సరైన పోస్టులు వేయండి. అలా కాకుండా ఇలాంటి పోస్టులు వేయడం వల్ల యాక్టర్స్ ఇమేజ్, మూవీ ఫేమ్ డ్యామేజ్ అవుతుంది” అంటూ ట్వీట్ చేశాడు.

Jailer : జైలర్‌కి సీక్వెల్ రానుంది.. అలాగే ఆ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్స్

ఇక బెదురులంక విషయానికి వస్తే.. 2012లో యుగాంతం రాబోతుంది అంటూ అప్పటిలో ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సినిమా మెయిన్ లైన్ గా తీసుకోని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోదావరి బెదురులంకకి చెందిన గ్రామస్తులు ఆ ప్రచారం నమ్మి ఎటువంటి పరిస్థితులు ఎదురుకున్నారు అనే అంశాన్ని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా చూపించబోతున్నారు. కొత్త దర్శకుడు క్లాక్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొని మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.