హ్యాపీ బర్త్ డే అక్షయ్, ‘Bell Bottom’ స్టన్నింగ్ లుక్

  • Publish Date - September 9, 2020 / 01:13 PM IST

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 53వ జన్మదినం జరుపుకున్నాడు. న్యూ ఫిల్మ్ ‘Bell Bottom’ సినిమా షూటింగ్ సెట్స్ లో చిత్ర యూనిట్ మధ్య జరుపుకున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్..ఇటీవలే ప్రారంభమైంది. చిత్ర షూటింగ్ లో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డిఫరెంట్ రూపంలో కనిపిస్తున్న అక్షయ్ ని చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.




చిత్రంలో ఓ విమానం ముందు..స్టైలిష్ గా నిలబడ్డారు. నళ్ల కళ్లద్దాలు నీట్ కటింగ్, నీట్ షేవింగ్, మందపాటి మీసాలతో యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నాడు. గోధుమ రంగు జాకెట్, ఇదే కలర్ ప్యాంటు, షూస్, టీషర్ట్ ధరించి వ్యాన్ నుంచి దిగుతున్న ఫొటో ఆకట్టుకొంటోంది.
https://10tv.in/drugs-are-rampant-in-kannada-film-industry/
బెల్ బాటమ్ సినిమాలో వాణి కపూర్ నటిస్తున్నారు. మొట్టమొదటిసారి ఈమె అక్షయ్ సరసన నటిస్తున్నారు. 2021 జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.




అక్షయ్ కుమార్..వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. లక్ష్మీ బాంబ్ సినిమా అనంతరం అక్షయ్ కుమార్ పలు సినిమాకు ఒకే చెబుతున్నారు. సూర్యవంశీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇది దీపావళికి రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.