Chatrapathi Remake : బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్ లీక్.. సూపర్ అంటున్న నెటిజెన్లు!

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజెన్లు సూపర్ అంటున్నారు.

Bellamkonda Sreenivas Chatrapathi Remake Teaser leaked

Chatrapathi Remake : టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) టాలీవుడ్ కి అల్లుడు శీను సినిమాతో పరిచయం అయ్యాడు. ఇప్పుడు తన 10వ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని రీమేక్ చేస్తూ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. తనకి అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ డెబ్యూట్ ఇచ్చిన వి వి వినాయక్ నే బాలీవుడ్ ఎంట్రీ కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Bellamkonda Sreenivas : పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో బెల్లంకొండ కొత్త సినిమా..

మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మూవీ టీజర్ ని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా టీజర్ లీక్ అయ్యింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఆ టీజర్ చూసిన నెటిజెన్లు సూపర్ అంటున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అంటున్నారు. అలాగే వింటేజ్ వినాయక్ కూడా బ్యాక్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. టాలీవుడ్ ఆడియన్స్ కి అయితే టీజర్ బాగా నచ్చేసింది.

Jaya Janaki Nayaka : ‘జయ జానకి నాయక’ సినిమాతో వరల్డ్ రికార్డు సృష్టించిన హీరో బెల్లంకొండ..

కాగా ఈ సినిమాలో నుష్రత్ బరుచా (Nushrratt Bharuccha) హీరోయిన్‌గా నటిస్తోండగా, పెన్ స్టూడియోస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇక శ్రీరామనవమి సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ నేడు (మార్చి 30) తన కొత్త సినిమాని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) భీమ్లా నాయక్ (Bheemla Nayak) వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన సాగర్ కే చంద్రతో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.