Bellamkonda Sreenivas Chatrapathi Trailer Filled With Massive Mass Elements
Chatrapathi Trailer: బాలీవుడ్ ప్రేక్షకులు మాస్ అంటే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వర్షన్ యూట్యూబ్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఓ బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాను నేరుగా హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ మాస్ హీరో.
Chatrapathi Remake : ఎట్టకేలకు సప్నని పరిచయం చేసిన ఛత్రపతి..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాతో ప్రభాస్‌కు మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు వివి.వినాయక్ డైరెక్ట్ చేసిన మూవీ ‘ఛత్రపతి’ వేసవి కానుకగా మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Chatrapathi Remake : బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ అఫీషియల్ టీజర్ వచ్చేసింది..
ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ అంశాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మాస్ అంటే ఇదిరా.. అనేలా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్‌లు, బెల్లంకొండ హీరో చేసిన స్టంట్స్ అన్ని కూడా మనకు ఈ ట్రైలర్‌లో శాంపిల్ చూపెట్టారు. కాగా, ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ హీరో తల్లి పాత్రలో నటిస్తుండగా, అందాల భామ నుష్రత్ బారుచ్చా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.