×
Ad

Bhagyashri Borse: నేను చేసేది ఒక్కటే.. అంతకన్నా ఎక్కువ చెప్పలేను.. భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్..

మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయినప్పటికి భాగ్యశ్రీ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

Bhagyashri Borse said interesting things about Andhra King Taluka movie

Bhagyashri Borse; మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయినప్పటికి భాగ్యశ్రీ(Bhagyashri Borse) కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. గ్లామర్ విషయంలో కూడా కండీషన్స్ పెట్టకపోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆతరువాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. కాబట్టి, అర్జెంట్ గా ఈ బ్యూటీకి హిట్ కావాలి. అందుకోసం ఈ అమ్మడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో జత కట్టింది. ఈ కాంబోలో వస్తున్న సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా”.

GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులో తేడాలు

కన్నడ స్టార్ ఉపేంద్ర స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమాను దర్శకుడు పీ మహేష్ బాబు తెరకెక్కించగా నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ..” ఇక్కడి ప్రేక్షకులు హీరోలను ఇంతగా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. నార్త్ లో అలా ఉండదు. సరిగ్గా ఆలాంటి కథతోనే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వస్తోంది. ఆ కథను స్వచ్ఛమైన ప్రేమకథకు లింక్ చేశాడు దర్శకుడు మహేష్.

ఈ సినిమాలో నేను మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. ఆ పల్లెటూరు అమ్మాయి సాగర్ తో ప్రేమలో పడుతుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నాకు తెలిసింది ఒక్కటే.. వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలి, విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలి. అరుంధతి లాంటి పాత్ర చేయాలని కోరిక. రెండు సినిమాలేకే నన్ను తెలుగమ్మాయిగా అభిమానిస్తున్నారు. ఇలాంటి అభిమానం, గౌరవం, ప్రేమ ఎక్కడ దొరుకుతుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని”అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.