Bhairavam : ఓటీటీలోకి వచ్చేస్తున్న భైరవం.. ఎప్పుడు? ఎందులో?

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం భైర‌వం.

Bhairavam movie ott streaming date fix

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం భైర‌వం. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది క‌థానాయిక‌లు. ఈ చిత్రం మే 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇక‌ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభ‌వార్త అందింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూలై 18 నుంచి తెలుగు, హిందీ భాష‌ల్లో భైర‌వం మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు జీ5 తెలిపింది. థియేట‌ర్ల‌లో అల‌రించిన ఈ చిత్రం ఓటీటీలో మ‌రెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.

MM Keeravani : కీరవాణి ఇంట‌ తీవ్ర విషాదం.. ఆయ‌న‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..

వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అన్న క‌థాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.