MM Keeravani : కీరవాణి ఇంట‌ తీవ్ర విషాదం.. ఆయ‌న‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..

ప్రముఖ సంగీత దర్శకుడు కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

MM Keeravani : కీరవాణి ఇంట‌ తీవ్ర విషాదం.. ఆయ‌న‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..

MM Keeravani father Siva Shakthi Datta passed away

Updated On : July 8, 2025 / 9:09 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 92 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం రాత్రి మ‌ణికొండ‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్‌కు సోద‌రుడు.

శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబ‌ర్ 8న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మీపంలోని కొవ్వూరులో జ‌న్మించారు. క‌ళ‌ల‌పై ఉన్న ఆస‌క్తితో ఆయ‌న క‌మ‌లేశ్ అనే క‌లం పేరుతో చిత్ర‌కారుడిగా ప‌ని చేశారు. ఆ త‌రువాత సంగీతంపై ఉన్న ఇష్టంతో గిటార్‌, సితార్‌, హార్మోనియం వంటివి నేర్చుకున్నారు.

SSMB29 : మహేష్ బాబు తండ్రిగా ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు.. రాజమౌళి సినిమాలో ఆ హీరో..

ఆ త‌రువాత మ‌ద్రాసు వెళ్లిపోయి సోద‌రుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌తో క‌లిసి సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1988లో విడుద‌లైన జాన‌కి రాముడు చిత్రంతో వీరికి మంచి గుర్తింపు వ‌చ్చింది. శివ‌శ‌క్తి ద‌త్తా స్క్రీన్‌రైట‌ర్‌గా కూడా ప‌ని చేశారు. బాహుబలి 1లోని ‘మ‌మ‌త‌ల త‌ల్లి’, ‘ధీవ‌ర‌’, బాహుబ‌లి 2లో ‘సాహోరే బాహుబ‌లి’, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో ‘క‌థానాయ‌క‌’, ఆర్ఆర్ఆర్ లో ‘రామం రాఘ‌వ‌మ్‌’, హ‌నుమాన్ మూవీలో ‘అంజ‌నాద్రి థీమ్ సాంగ్‌’, సై మూవీలో ‘న‌ల్లా న‌ల్లాని క‌ళ్ల పిల్ల‌’, ఛ‌త్ర‌ప‌తిలో ‘మ‌న్నేల తింటివిరా’ వంటి పాట‌ల‌కు లిరిక్స్ రాశారు.

శివ‌శ‌క్తి ద‌త్తాకు ముగ్గురు సంతానం, కీర‌వాణి, క‌ల్యాణి మాలిక్‌, శివ శ్రీ కంచి,