Bhaje Vaayu Vegam : ఎడిటింగ్ అయ్యాక హార్డ్ డిస్క్‌లు క్రాష్.. మళ్ళీ మొదట్నుంచి.. ‘భజే వాయువేగం’ సినిమా నాలుగేళ్ల కష్టాలు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భజే వాయువేగం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Bhaje Vaayu Vegam Director Prashanth Reddy Reveals Interesting Facts about Movie

Bhaje Vaayu Vegam Director Prashanth Reddy : కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భజే వాయువేగం సినిమా మే 31న రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

ప్రశాంత్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. రన్ రాజా రన్, సాహో సినిమాలకు సుజిత్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాను. సాహో సమయంలోనే ఈ కథ రాసుకొని కార్తికేయకు చెప్పాను. కరోనా ముందే ఈ సినిమా ఓకే అయింది. కరోనా వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ట్రైలర్ లో అసలు కథ రివీల్ చేయలేదు. థియేటర్లో మీరు సినిమా చూసాక ఆశ్చర్యపోతారు. సినిమాలో ఒకటే సాంగ్ ఉంటుంది. సెకండాఫ్ లో సాంగ్స్ ఉండవు. సెకండ్ హాఫ్ ఎక్కడా బోర్ లేకుండా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కథకు తగ్గట్టు ఇంగ్లీష్ టైటిల్ లేకుండా భజే వాయు వేగం అని పెట్టాం. అఖిల్ తో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమాకు ఆ టైటిల్ ఇచ్చాడు. వెంటనే రిజిస్టర్ చేయించాము అని తెలిపారు.

Also Read : Prashanth Reddy : కాలేజీ మానేసి రోజూ షూటింగ్‌కి వెళ్లిన డైరెక్టర్.. రాజమౌళి ఏమన్నాడంటే..

అలాగే సినిమాలో పాత్రల గురించి మాట్లాడుతూ.. ‘భజే వాయు వేగం’ కథకు తగ్గట్టు ఫస్టాఫ్ లో పర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో హీరోయిజం కావాలి. దానికి తగ్గట్టు కార్తికేయ చాలా బాగా చేసాడు. ఊరి నుంచి సిటీకి వచ్చిన వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది. అలా ఈ సినిమాలో హీరోకి క్రికెట్ గోల్ ఉంటుంది. ఇక హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయ అమ్మాయి. ఐశ్వర్య మీనన్ హాఫ్ శారీ, చీరలో బాగుంటుంది. అందుకే తనని సెలెక్ట్ చేసుకున్నాను. కార్తికేయ తర్వాత రాహుల్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత రాహుల్ ఈ సినిమాతో మరోసారి మెప్పించబోతున్నాడు. ఒక ఫ్రెష్ ఫేస్ కావాలని రాహుల్ ని తీసుకున్నాము. తనికెళ్ళ భరణి గారు తండ్రి పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పారు.

అయితే భజే వాయువేగం కరోనా ముందు మొదలుపెట్టిన సినిమా నాలుగేళ్ళ తర్వాత రావడానికి, ఎందుకు ఇంత లేట్ అయిందో చెప్తూ.. భజే వాయువేగం సినిమా ఆలస్యం అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా ముందే మొదలుపెట్టాం. 70 శాతం షూటింగ్ కూడా చేసాం. కరోనా వల్ల సినిమా షూట్ ఆగింది. ఈ లోపు కార్తికేయ బెదురులంక సినిమా చేయడానికి వెళ్ళాడు. దాని నుంచి వచ్చాక జుట్టు పెంచడానికి కొంచెం సమయం తీసుకున్నాం. షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ చేసాక హార్డ్ డిస్క్ లు క్రాష్ అయి మళ్ళీ మొదట్నుంచి ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల మూడు నెలలు వేస్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఇలా అన్ని కారణాలతో సినిమా చాలా ఆలస్యం అయింది అని తెలిపాడు డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.

Also Read : Fahadh Faasil : ఆ వ్యాధితో బాధపడుతున్న పుష్ప నటుడు.. 41 ఏళ్ళ వయసులో..

ఇక ఈ సినిమాలో సాంగ్ కి రధన్ మ్యూజిక్ ఇస్తే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కపిల్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు. రధన్ చెన్నైలో ఉంటాడు. నాకు అక్కడికి ఇక్కడికి తిరగటానికి చాలా టైం వేస్ట్ అవుతుందని పాటకి అతనితో చేయించి, బ్యాక్ గ్రౌండ్ అంతా ఇక్కడే చేయించాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు