×
Ad

Bheems Ceciroleo : బలగం సంగీత దర్శకుడికి దాదాసాహెబ్ అవార్డు..

బలగం సినిమాకి మరో అవార్డు. మ్యూజిక్ డైరెక్టర్ భీమస్ సెసిరోలెకి దాదాసాహెబ్ ఫాల్కే..

  • Published On : April 30, 2023 / 09:52 PM IST

Bheems Ceciroleo award as Dada Saheb Phalke best music director

Bheems Ceciroleo : ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసిన చిత్రం బలగం (Balagam). జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) ప్రధాన పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగానే అవార్డులు పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తుంది.

Balagam : తెలంగాణ ప్రభుత్వం తరపున బలగం చిత్ర యూనిట్ కు సన్మానం..

ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకున్న బలగం.. ప్రపంచవ్యాప్తంగా పలు క్యాటగిరిలో మొత్తం 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను సంచలనం సృష్టించింది. తాజాగా మరో అవార్డుని కూడా గెలుచుకుంది. ఈ సినిమాకి భీమస్ సెసిరోలె సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు.

Balagam : థియేటర్‌లో ‘బలగం’ బలం ఏమాత్రం తగ్గేదేలే..

81 దేశాలు నుంచి 780 మంది పోటీ చేయగా భీమస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాని మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కి, అలాగే ఆస్కార్ కి కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు తెలియజేసిన సంగతి తెలిసిందే. దీంతో రానున్న రోజుల్లో ఎన్ని ఇంకెన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.