Bhola Shankar ugadi poster goes viral trolls on poster in social media
Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం మెగాస్టార్ మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో భోళా శంకర్(Bhola Shankar) సినిమా చేస్తున్నాడు. ఇది అజిత్(Ajith) నటించిన తమిళ సినిమా వేదాళం(Vedalam) సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో తమన్నా(Tamannaah) చిరంజీవికి జోడిగా నటిస్తుంటే, కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. స్టార్ కాస్ట్ చాలా మంది ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఉగాది సందర్భంగా భోళాశంకర్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో ఒక చైర్ లో ఓ వైపు కీర్తి సురేష్, ఓ వైపు తమన్నా కూర్చున్నారు. వీరిద్దరి వెనకాల మధ్యలో చిరంజీవి నిల్చున్నారు. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. దీన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీమర్స్ అయితే ఈ పోస్టర్ పై రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
Akashay Kumar : ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇదైనా అక్షయ్ కి హిట్ ఇస్తుందా?
ఈ పోస్టర్ చూస్తుంటే పండగలకు బట్టల షాపింగ్ మాల్స్ ఇచ్చే యాడ్స్ లా ఉంది. దీంతో చాలా మంది ఈ పోస్టర్ పై పలు షాపింగ్ మాల్స్ పేర్లు వేసి, ఉగాది ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ పై చిరంజీవి అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుంటే, ఇదేం పోస్టర్ రా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మీమర్స్ ఈ పోస్టర్స్ ని షేర్ చేస్తూ సినిమాపై, డైరెక్టర్ మెహర్ రమేష్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో చిరంజీవి భోళా శంకర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ తో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడా లేదా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.