Bigg Boss 7 Telugu elimination 10th week
Bigg Boss 7 Telugu elimination : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో పదో వారం ముగింపు వచ్చేసింది. తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్, తొమ్మిదో వారంలో టేస్టీ తేజాలు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో రతిక రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు పదో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో గౌతమ్ కృష్ణ, రతిక, ప్రిన్స్ యావర్, భోలే షావలి, శివాజీ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో రతిక రోజ్, భోలే షావలి లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు అనధికార ఓటింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో రతిక ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే.. పాట బిడ్డ భోలే షావలి ఇంటి నుంచి బయటకు రానున్నాడని టాక్.
VJ Sunny : బిగ్ బాస్ స్ర్రిప్టెడా? బిగ్ బాస్ సీక్రెట్స్ బయటపెట్టిన ఆ సీజన్ విన్నర్
వాస్తవానికి టాస్క్‌ల పరంగా భోలె కూడా పెద్దగా ఆడింది లేదు. అయితే.. తనదైన పాటలతో మాత్రం ఆకట్టుకుంటున్నాడు. అప్పటికప్పుడు పాటలను అల్లుతూ అవలీలగా పాడేస్తున్నాడు. కాగా.. పదో వారంలో అతడు ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. చూడాలీ మరీ ఇందులో ఎంత నిజం ఉంది అన్నది. భోలెనే ఎలిమినేట్ అయ్యాడా..? లేక మరెవరు అయినా ఎలిమినేట్ అయ్యారా..? అన్నది పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ తెలియదు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.