Bhole Shavali singer and Music Director wild Card in Bigg boss 7
Bhole Shavali : బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) తెలుగు అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం. అయితే ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.
భోలే శవాలీ తెలంగాణకు చెందిన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. సినీ పరిశ్రమలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన భోలే శవాలీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తూ యూట్యూబ్ లో పేరు తెచ్చుకున్నాడు. అలాగే పలు చిన్న సినిమాలకు కూడా సంగీతం అందించాడు. ఇటీవల కష్టపడ్డా.. ఇష్టపడ్డా.. లవ్ లో పడ్డ.. అంటూ ఓ సరదా ఫోక్ సాంగ్ తో బాగా వైరల్ అయ్యాడు. ఈ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి హౌస్ లో తన పాటలతో అలరిస్తాడో గేమ్ తో మెప్పిస్తాడో చూడాలి. ఇక షోలో ఎంట్రీ ఇచ్చాక వేదికపై నాగార్జున, బిగ్ బాస్ గురించి ఓ పాట పాడి ఇంప్రెస్ చేశాడు.