విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ నటిస్తున్న బాలీవుడ్ థ్రిల్లర్.. ‘భూత్ : పార్ట్ వన్. హాంటెడ్ షిప్’ 2020 ఫిబ్రవరి 21న విడుదల కానుంది..
మసాన్, రాజీ, సంజు వంటి డిఫరెంట్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్.. ‘ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్స్’ సూపర్ హిట్ అవడంతో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హారర్ జానర్‌లో నటిస్తున్నాడు విక్కీ.. ‘భూత్ : పార్ట్ వన్. హాంటెడ్ షిప్’ అనే సినిమా చేస్తున్నాడు. భూమి పెడ్నేకర్ హీరోయిన్..
భాను ప్రతాప్ సింగ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో, హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశంకా ఖైతాన్ నిర్మిస్తున్నారు. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా నవంబర్ 15న రిలీజ్ చెయ్యాలనుకున్నారు.
ఇప్పుడు విడుదల వాయిదా వేశారు. 2020 ఫిబ్రవరి 21న ‘భూత్ : పార్ట్ వన్. హాంటెడ్ షిప్’ మూవీని విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్. ఇక ముందు భూత్ సిరీస్‌ను కంటిన్యూ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కరణ్ జోహార్ చెప్పాడు.