×
Ad

Bhumi Pednekar : అరలీటరు నీళ్లు 150 రూపాయలా? హీరోయిన్ కొత్త బిజినెస్ బాగుందిగా..

బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.

Bhumi Pednekar launches premium water brand for rs 200

సినీ న‌టుల్లో కొంద‌రు కేవలం సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా వివిధ ర‌కాల వ్యాపారాలు చేస్తూనే ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్ కూడా ఈ కోవ‌కే చెందుతుంది. ఆమె బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. త‌న సోద‌రి సమీక్షా పెడ్నేకర్ తో బ్యాక్‌బే ఆక్వా అనే వాట‌ర్ బ్రాండ్ కంపెనీని ప్రారంభించింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే లక్ష్యం అని అంటోది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో సొంతంగా ఓ ప్లాంట్‌ స్థాపించామ‌ని, అందుకు ఎంతో గర్వంగా ఉందింది. ఈ హిమాల‌య‌న్ నీటి త‌యారీకి మాన‌వ ప్రేయం ఉండ‌ద‌ని, దీని వ‌ల్ల క‌లుషితం అయ్యేందుకు ఆస్కారం లేదంటోంది. ఇంత‌కు ఈ హీరోయిన్ కంపెనీ వాట‌ర్ బాటిల్ ధ‌ర ఎంతో తెలుసా? అక్ష‌రాల 200 రూపాయ‌లు.

Satyadev – Vishwak Sen : జస్ట్ మిస్ సూపర్ హిట్ సినిమా.. సత్యదేవ్ చేయాల్సింది విశ్వక్ సేన్ కి వచ్చింది.. రాత్రికి రాత్రే డైరెక్టర్..

అవును మీరు చ‌దివించింది నిజ‌మే.. దీనిపై భూమి మాట్లాడుతూ.. “మాది ప్రీమియం వాటర్‌ బ్రాండ్‌ కంపెనీ. పూర్తి ప‌ర్యావ‌ర‌ణ స్పృహతో మా సంస్థ ప‌ని చేస్తుంది. అందుక‌నే ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌ను వాడ‌లేదు. బాటిల్ క్యాప్ కూడా భూమిలో క‌లిసిపోయే విధంగా త‌యారు చేశాం. అర లీట‌ర్ వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.150, 750 ఎంఎల్ వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.200గా నిర్ణ‌యించాం.” అని తెలిపింది.

ప్ర‌జలు ఈ రోజుల్లో ఎన‌ర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తార‌ని అంది. త‌మ కంపెనీ బాటిల్‌లోని నీరు చాలా స్వ‌చ్ఛ‌మైంద‌ని, ఇందులో సహజసిద్ధమైన మినరల్స్‌, ఎలెక్టోలైట్స్‌ పుష్కలంగా ఉంటాయ‌ని చెప్పుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్‌ మీ ముందుకు తీసుకొస్తున్నాం అని తెలిపింది.

కాగా.. హీరోయిన్ భూమి ఫ‌డ్నేక‌ర్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన త‌రువాత ర‌క‌రకాల స్పంద‌న‌లు వ‌స్తున్నాయి.