Bhumika Chawla Reunited with Director Gunasekhar working stills goes viral
Bhumika Chawla : డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమా తర్వాత ఇప్పుడు కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న కొన్ని దురాగతాలు, ప్రస్తుత యువతకు చెందిన అంశాలతో ‘యుఫోరియా’ అనే సినిమా చేస్తున్నాడు గుణశేఖర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లే చేస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక స్పెషల్ రోల్ చేయనుందని గతంలోనే ప్రకటించారు.
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక జంటగా 2003లో ఒక్కడు సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు 21 ఏళ్లకు మళ్ళీ భూమిక గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది. దీంతో ఈ కాంబోపై అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. వచ్చే సంవత్సరమే.. నిర్మాత కామెంట్స్..
ఇక ఈ ‘యుఫోరియా’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తవ్వగా తాజాగా సెకండ్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ చేసారు. భూమిక ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో పాల్గొంది. ‘యుఫోరియా’ షూటింగ్ సెట్స్ నుంచి గుణశేఖర్, భూమిక వర్కింగ్ స్టిల్స్ మూవీ యూనిట్ షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాలో భూమిక ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి.