Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. వచ్చే సంవత్సరమే.. నిర్మాత కామెంట్స్..
బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి.

Producer Bellamkonda Suresh speak about his son Bellamkonda Sai Sreenivas Marriage
Bellamkonda Sai Sreenivas : స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా పరిచయమయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కువ యాక్షన్ సినిమాలు చేస్తూ అక్కడక్కడా విజయాలు అందుకున్నా పరాజయాలు ఎక్కువ పలకరించాయి. శ్రీనివాస్ తెలుగులో చివరిసారిగా 2021లో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసినా డిజాస్టర్ అయింది.
అయితే శ్రీనివాస్ చేతిలో మాత్రం చాలా సినిమాలు ఉన్నాయి. త్వరలో భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు సినిమాతో రాబోతున్నాడు. అవి కాకుండా మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, ఒకప్పటి స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Pushpa 2 : రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన పుష్ప యూనిట్.. ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే..
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. మా పెద్దబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఏప్రిల్ లో నేను ఇంకో సినిమా మొదలుపెడతాను. శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరమే ఉండొచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలో దాని గురించి చెప్తాము. చిన్న అబ్బాయి కెరీర్ లో ఇంకా సెట్ అవ్వాలి. ఆ తర్వాతే పెళ్లి అని తెలిపారు. మరి ఈ యాక్షన్ హీరోని చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరో చూడాలి.