Pushpa 2 : రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన పుష్ప యూనిట్.. ఆ టికెట్స్ బుక్ చేసుకుంటే..
పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మేట్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Allu Arjun Pushpa 2 Movie Not Releasing in that Format Fans Disappointing
Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ప్రేమిటర్ షోలు పడబోతున్నాయి. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇప్పటికే బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. అయితే రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కి మూవీ టీమ్ ఓ విషయంలో షాక్ ఇచ్చింది.
పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మేట్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, 2డీ, 3డీ ఫార్మేట్స్ లో పుష్ప 2 సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఆ ఫార్మెట్స్ లో సినిమాని ఆస్వాదించాలని బుకింగ్స్ కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు 3డీ ఫార్మేట్ లో సినిమా రిలీజ్ అవ్వట్లేదని సమాచారం. సినిమాని 3డీ వర్షన్ కి తగ్గట్టు షూట్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ పనులు ఇంకా పూర్తవ్వకపోయేసరికి 3డీ వర్షన్ లో సినిమా ప్రస్తుతానికి రిలీజ్ చేయట్లేదని తెలుస్తుంది.
Also Read : Naga Chaitanya – Sobhita : నేడే నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ?
అయితే ఇప్పటికే 3డీ వర్షన్ లో సినిమా చూద్దామని పలు థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు ఫ్యాన్స్. ఆ థియేటర్స్ లో ప్రస్తుతానికి 2డీ వర్షన్ సినిమానే వేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 3డీ వర్షన్ లో పుష్ప 2 సినిమాని చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. కానీ త్వరలో కొని రోజుల తర్వాత మళ్ళీ 3డీ వర్షన్ రిలీజ్ చేస్తారని సమాచారం.