Naga Chaitanya – Sobhita : నేడే నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ?

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నేడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.

Naga Chaitanya – Sobhita : నేడే నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ?

Naga Chaitanya Sobhita Dhulipala Marriage Day Here Details

Updated On : December 4, 2024 / 9:59 AM IST

Naga Chaitanya – Sobhita : హీరో నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నేడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. ఇప్పటికే హల్దీ వేడుకలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుని చేయడం అయిపోయాయి. వీటికి సంబంధించిన ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.

నాగచైతన్య – శోభిత వివాహం నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు వేసిన మండపంలో జరగనుంది. నేడు రాత్రి 8 గంటల 13 నిమిషాలకు వీరి పెళ్లి ముహూర్తం. చైతు – శోభిత పెళ్లి ఇరు కుటుంబాలు, సన్నిహితులతో పాటు కేవలం అతి కొద్దిమంది సినీ ప్రముఖుల మధ్య మాత్రమే జరగనుంది.

Also Read : Megastar Chiranjeevi : ఇది కదా అసలైన బాస్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే.. మెగాస్టార్ మాసివ్ లైనప్..

దీంతో చైతు – శోభిత పెళ్లి ఫొటోలు, వీడియోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి నేడు రాత్రి పెళ్లి నుంచి ఫొటోలు, వీడియోలు ఏమైనా లీక్ అవుతాయా లేక శోభిత – నాగచైతన్య అధికారికంగా పెళ్ళి ఫొటోలు పోస్ట్ చేస్తారా చూడాలి.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)