Megastar Chiranjeevi : ఇది కదా అసలైన బాస్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే.. మెగాస్టార్ మాసివ్ లైనప్..
చిరు ఇప్పుడు ఓకే చేస్తున్న సినిమాలతో అనౌన్స్ తోనే సూపర్ అనిపిస్తున్నారు.

Megastar Chiranjeevi Massive Lineup with Young Directors
Megastar Chiranjeevi : చిరంజీవి కొన్నేళ్ల క్రితం రాజకీయాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాలోకి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను ఆల్మోస్ట్ మూడు దశాబ్దాలు ఏలిన హీరో మెగాస్టార్. కోట్లాది మంది అభిమానులు, ఆకాశాన్నంటే స్టార్ డమ్ ఆయన సొంతం. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న స్టార్స్ అంతా ఆయన అభిమానులే.
అయితే బాస్ సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు మూడు సినిమాలు తప్ప ఇది కదా చిరంజీవి సినిమా అని అనిపించుకున్న సినిమాలు తక్కువ. ఆచార్య, భోళాశంకర్ లాంటి సినిమాలు చూసి ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. మెగాస్టార్ రొటీన్ కమర్షియల్ సినిమాల నుంచి బయటకు రావాలని, రజినీకాంత్, మమ్ముట్టి, కమల్ లాగా ప్రయోగాలు చేయాలని, ఇప్పటి జనరేషన్ ఙకి తగ్గట్టు సినిమాలు చేయాలని అభిమానులు, ప్రేక్షకులు, టాలీవుడ్ సైతం కోరుకుంది.
Also Read : Pushpa 2 Actors : పుష్పలో నటించిన ఆ స్టార్స్ అంతా ఎక్కడ? ప్రమోషన్స్ లో కానరాని పుష్ప నటులు..
ఈ కామెంట్స్ ని చిరు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఓకే చేస్తున్న సినిమాలతో అనౌన్స్ తోనే సూపర్ అనిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సోషియో ఫాంటసీ జానర్. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దాని తర్వాత తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండొచ్చు. తాజాగా నిన్న దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమాని ప్రకటించారు. మోస్ట్ వైలెంట్ సినిమా అని అనౌన్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో కామెడీ ఎంటర్టైనర్ ఉందని టాక్. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవితో సినిమా చేయనున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి.
దీంతో ఈ డైరెక్టర్స్ తో ఇలాంటి లైనప్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలు మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని తీసుకొచ్చి బాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించాలి అని అభిప్రాయపడుతున్నారు. అసలు 69 ఏళ్ళ వయసులో ఇంత భారీ లైనప్ పెట్టి వర్క్ చేయడం అంటే మాములు విషయం కాదు. మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నారు చిరంజీవి.