Pushpa 2 Actors : పుష్పలో నటించిన ఆ స్టార్స్ అంతా ఎక్కడ? ప్రమోషన్స్ లో కానరాని పుష్ప నటులు..

సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి.

Pushpa 2 Actors : పుష్పలో నటించిన ఆ స్టార్స్ అంతా ఎక్కడ? ప్రమోషన్స్ లో కానరాని పుష్ప నటులు..

Pushpa 2 Actors not Participated in Promotions

Updated On : December 4, 2024 / 9:13 AM IST

Pushpa 2 Actors : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రేపు డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇవాళ రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కువగా ప్రమోషన్స్ చేయకుండా ఇండియా వైడ్ ప్రధాన నగరాల్లో కొన్ని ఈవెంట్స్ భారీగా నిర్వహించి సరిపెట్టేసారు. అయితే ఈ ఈవెంట్స్ లో రష్మిక, అల్లు అర్జున్, మైత్రి నిర్మాతలు మాత్రమే పాల్గొన్నారు.

హైదరాబాద్, చెన్నై ఈవెంట్స్ లో మాత్రం వీళ్లకు తోడు దేవిశ్రీ ప్రసాద్, శ్రీలీల పాల్గొన్నారు. హైదరాబాద్ ఈవెంట్లో అనసూయ వచ్చింది. కానీ సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లేదా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే సినిమాలో నటించిన ముఖ్యమైన తారలంతా వస్తారు. వచ్చి మాట్లాడతారు. చిన్న చిన్న నటులు అయితే బయట యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. కానీ పుష్ప 2 ప్రమోషన్స్ లో ఎక్కడా వేరే యాక్టర్స్ కనిపించలేదు.

Also See : Rashmika Mandanna : శ్రీవల్లి క్యూట్ ఫొటోలు.. చీరలో అదరగొట్టిన రష్మిక మందన్న..

పుష్ప సినిమా అంటే అల్లు అర్జున్, రష్మిక అనే ప్రచారం చేస్తున్నట్టు ఉంది. కానీ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు, రావు రమేష్, అజయ్ ఘోష్, కన్నడ స్టార్ ధనుంజయ, అజయ్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, పుష్ప ఫ్రెండ్ పాత్రలో నటించిన జగదీశ్, శ్రీతేజ్, పుష్ప తల్లి పాత్రలో నటించిన కల్పలత, మైమ్ గోపి.. ఇలా చాలామంది నటీనటులు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరూ పుష్ప ప్రమోషన్స్ లో కనపడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పిలిచి మాట్లాడించలేదు.

వాళ్ళు రాలేదా, వీళ్ళు పిలవలేదా తెలీదు కానీ తెలుగులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఈ స్టార్స్ అంతా రాకపోవడం ఆశ్చర్యం. మరి సినిమా సక్సెస్ మీట్ లో అయినా వీళ్ళందర్నీ పిలిచి మాట్లాడిస్తారా చూడాలి.