Bhushan Kumar : బాలీవుడ్ లో అత్యంత ధనిక కుటుంబం ఎవరో తెలుసా.. 10000 కోట్లకి అధిపతి..

Bhushan Kumar the richest family in Bollywood Head of 10000 crores

Bhushan Kumar : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బడా స్టార్స్, డబ్బున్న వారున్నారు. అనేక సినిమాలు చేసి కోట్లు కూడబెట్టారు. ఇక అందులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముందు వరుసలో ఉండేవారు. అలాగే బాలీవుడ్ లో ఇప్పటికే కపూర్స్, ఖాన్స్, చోప్రాస్.. ఇలా అన్ని కుటుంబాల నుండి వచ్చి స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం వారు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

కానీ ఒక్క స్టార్ హెల్ప్ కూడా లేకుండా బాలీవుడ్ లోనే అత్యంత ధనిక కుటుంబంగా ఎదిగారు టి-సిరీస్ యాజమాన్యం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లను మించే ఆస్థి కూడబెట్టారు. అయితే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, భూషణ్ కుమార్ అతని కుటుంబ సభ్యుల ఆస్థి విలువ 10,000 కోట్లని తెలుస్తుంది. మిగతా బాలీవుడ్ స్టార్స్ ని చూసుకుంటే..6,000 కోట్లు, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వరుసగా రూ. 2,900 కోట్లు మొత్తానికి వీరు టి-సిరీస్ యాజమాన్యం కంటే తక్కువగానే ఉన్నారు.

Also Read : Sravanthi Chokkarapu : 40 రోజుల నరకం.. విపరీతమైన బ్లీడింగ్.. హాస్పిటల్ బెడ్ పై ఫోటోలు షేర్ చేసిన యాంకర్..

ప్రస్తుతం భూషణ్ కుమార్ టి-సిరీస్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఈ కుటుంభం పండ్లు అమ్మారట. ఆ స్థాయి నుండి ఈ రోజు 10000 కోట్లకి అధిపతి అయ్యారు. ఇప్పుడున్న స్టార్ హీరోస్ కంటే ఎక్కువ సంపాదించారు.