Vijay Antony Daughter : బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. 16 ఏళ్ళ వయసులో..

విజయ్ ఆంటోనీ కూతురు లారా(Laura) ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తాజాగా ఇవాళ తెల్లవారు జామున లారా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Bichagadu Movie fame Vijay Antony Daughter Laura Passed away

Vijay Antony Daughter : బిచ్చగాడు(Bichagadu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించారు. ఓ పక్క నటుడిగా, మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బిజీగా ఉన్నారు విజయ్ ఆంటోనీ. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. విజయ్ ఆంటోనీకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

విజయ్ ఆంటోనీ కూతురు మీరా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తాజాగా ఇవాళ తెల్లవారు జామున లారా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమిళ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. అంత సక్సెస్ ఫుల్ హీరో, సంగీత దర్శకుడి కూతురు ఎంధుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసి హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సమాచారం.

Jawan Movie : జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళతాం.. షారుఖ్ సర్‌తో నేను మాట్లాడతాను.. అట్లీపై ట్రోల్స్..

అయితే 12వ తరగతి చదువుతున్న మీరా ఆత్మహత్య ఎందుకు చేసుకుందా అనేదానికి ఇంకా సరైన కారణాలు ఎవరికీ తెలియలేదు. కానీ చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. దీంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.