Big Boss Priyanka did Prank in Tirupati video goes viral
Big Boss Priyanka : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 7 సీజన్లను విజయంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే సీజన్ 7లో వచ్చిన కంటెస్టెంట్స్ బయటికి వచ్చిన తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక వారిలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక కూడా ఒకరు. బిగ్ బాస్ కంటే ముందు పలు సీరియల్స్, షోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉంది. టాప్ 5 వరకు వచ్చింది.
అయితే ప్రియాంక కేవలం సీరియల్స్, షోస్ మాత్రమే కాకుండా యూట్యూబ్ కూడా చేస్తుంటుంది. యూట్యూబ్ లో ఎల్లప్పుడూ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె తిరుపతికి వెళ్లిన వీడియో షేర్ చేసింది. మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర తన ప్రియుడితో కలిసి ఓ రీల్ చేసింది. చిరుత వస్తున్నట్టు ఓ ఆడియో పెట్టి.. తిరుపతి వెళ్లే దారిలో మామీద చిరుత ఎటాక్?? అని ఒక ఫోటో పెట్టి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వీడియో చివర్లో ఇదంతా ప్రాంక్ అని రివీల్ చేశారు.
Also Read : Naga Chaitanya – Sobhita Dhulipala : అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ పెళ్లి.. ఆ వార్తలు ఫేక్..
ఇక ఈ వివాదం టీటీడీ దృష్టికి వెళ్లడంతో టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి దీనిపై స్పందించారు. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి పిచ్చి పని చేసినందుకు ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివ్ కుమార్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.