Monalisa bhosle: మోనాలిసా పెళ్ళిలో బిగ్ ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు.
మోనాలిసా భోంస్లే(Monalisa bhosle) భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు.
- V Santhosh Kumar
- Published On : April 10, 2026 / 02:06 PM IST
Big Twist in Monalisa Marriage: POCSO Case Registered Against Husband Farman Khan.
Monalisa bhosle; ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా(Monalisa bhosle) భోంస్లే ఉదంతం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌ను ఆమె ఈ ఏడాది మార్చి 11న కేరళలోని ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి సమయంలో మోనాలిసా మైనర్ అని, ఆమె వయసు కేవలం 16 ఏళ్లేనని విశ్వహిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Romanchikam: కుర్ర హీరోతో సందీప్ రెడ్డి వంగా మూవీ.. డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
ఈ ఫిర్యాదుపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) లోతుగా విచారణ జరిపింది. ఆధారాలను పరిశీలించిన అనంతరం, వివాహం నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది. మైనర్ అని తెలిసినా ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను ఎదిరించి చేసుకున్న ఈ పెళ్లి, చట్టపరమైన చిక్కుల్లో పడటంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్‌గా వెలిగిన యువతి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
