Romanchikam: కుర్ర హీరోతో సందీప్ రెడ్డి వంగా మూవీ.. డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
కుర్ర హీరో సుమంత్ ప్రభాస్ తో రోమాంచికం(Romanchikam) అనే సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగ.
sandeep reddy vanga and sumanth prabhas movie title is Romanchimkam
- సుమంత్ ప్రభాస్ హీరోగా కొత్త సినిమా
- నిర్మాతగా సందీప్ రెడ్డివంగా
- వేణు డైరెక్షన్ లో రోమాంచకం
Romanchikam: టాలీవుడ్లో తనదైన ‘వైలెంట్’ మేకింగ్ స్టైల్‌తో ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏ సినిమా చేసినా సెన్సేషనే. అయితే, ఇప్పుడు నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు సందీప్. తన హోమ్ బ్యానర్ ‘భద్రకాళి పిక్చర్స్’పై కథాబలమున్న చిన్న చిత్రాలను ప్రోత్సహించే క్రమంలో, పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
Sreeleela: తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న శ్రీలీల.. ఫొటోలు వైరల్
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘రొమాంచికం’ (Romanchikam) అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా, యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా ద్వారా వేణు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా గుర్తింపు పొందిన వేణు, తన తొలి చిత్రంతోనే సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ దర్శకుడి నిర్మాణంలో అవకాశం దక్కించుకోవడం విశేషం. సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఇమేజ్ తోడవ్వడంతో, ఈ చిన్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సందీప్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
