Bigg Boss Weekend Episode : వీకెండ్ ఎపిసోడ్.. రోహిత్, షాలిని, త్రిగున్ కి ఇచ్చిపడేసిన నాగార్జున.. పనిషమెంట్స్ ఇచ్చి.. బిగ్ బాస్ 10 ‘డే 6’ ఫుల్ ఎపిసోడ్..
నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు.(Bigg Boss Weekend Episode)
- Saketh U
- Published on- September 12, 2026 / 10:35 PM IST
Bigg Boss Weekend Episode
Bigg Boss Weekend Episode : మొదటి వారంలోనే చరణ్, చైత్రలను ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. నేడు వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజంతా కంటెస్టెంట్స్ ఏం చేసారో ముందు అది చూపించారు. త్రిగున్ రోహిత్ గురించి అందరికి క్లారిటీ ఇచ్చేసాడు ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో. రోహిత్ అగ్నిపరీక్ష బ్యాచ్ ని తన కింద పెట్టుకొని ఒక్కొక్కర్ని పంపించడానికి ట్రై చేస్తూ త్రిగున్ తో గొడవ పడుతూ సింపతీ కోటేయడానికి ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై త్రిగున్ వర్షిణి, ముకేశ్ దగ్గర మాట్లాడి ప్రేక్షకులకు కూడా క్లారిటీ ఇచ్చాడు. రామ్ ప్రసాద్, నరేష్ అందరి గురించి సరదాగా బిగ్ బాస్ కెమెరా ముందు రివ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రోహిత్ గురించి అందరూ అనుకునేదే చెప్పి క్లారిటీ ఇచ్చాడు రామ్ ప్రసాద్.
అనంతరం నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. రామ్ ప్రసాద్, నరేష్ ని బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చినందుకు నాగార్జున అభినందించాడు. సీక్రెట్ రూమ్ లో ఎలిమినేట్ అయినవాళ్లు లేరు అని నాగార్జున వాళ్ళతో వీడియో కాల్ చేయించి క్లారిటీ ఇచ్చేసాడు. చరణ్ ని వీడియో కాల్ లోకి తీసుకొని చరణ్ యాక్టివ్ గా ఇంకొంచెం ఉంటె బాగుండేది అని నాగార్జున అన్నాడు. చరణ్ కి షాలిని తో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అనంతరం చైత్ర కాల్ లోకి వచ్చి ముకేశ్ తో మాట్లాడింది. ఇక చైత్ర రోహిత్ వల్లే నేను వెళ్ళిపోయాను అని చెప్పింది. అందరూ రోహిత్ గురించి చెప్పే కారణాలే చెప్పింది.
అనంతరం రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్.. ముగ్గురే హౌస్ మేట్స్ అయ్యారు అని అభినందించారు. మిగిలిన 11 మంది ఇంకా హై రిస్క్ లో ఉన్నారని చెప్పాడు. ఇందుకు ఆ ముగ్గురికి మూడు మిల్క్ షేక్స్ ఇచ్చాడు. వాళ్ళు ముగ్గురూ తాగిన గ్లాసెస్ ని నాగార్జున కడిగి చూపించారు. రోహిత్ నేను ఎంగిలి కప్స్ కడగను, నా చేతులు బాగోలేవు, మాయిశ్చరైజర్ పోతుంది.. ఇలా చెప్పిన కారణాలు అన్ని చెప్పి నాగార్జున గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కప్స్ కడగనందుకు రోహిత్ పై గట్టిగానే ఫైర్ అయ్యాడు నాగార్జున. అయినా రోహిత్ నాగార్జునతో గొడవ పెట్టుకోడానికి ట్రై చేసాడు. వీడియో ప్లే చేసి రోహిత్ చేసిన తప్పుని చూపించాడు. హౌస్ లో ఉన్న అందరూ కూడా తప్పు అని చెప్పారు. అలాగే హౌస్ లోకి వెళ్లేముందు ఇచ్చిన వాటర్ గ్లాస్ టాస్క్ చేయనందుకు తిట్టాడు నాగార్జున. దాంట్లో ఫెయిల్ అని ఒప్పుకున్నాడు రోహిత్. తన పని చేయననుందుకు చాలా కప్స్ కడగమని రోహిత్ కి పనిషమెంట్ ఇచ్చాడు నాగ్. ఆ పని చూడమని షాలిని కి అప్పచెప్పాడు.
అనంతరం ఆడియన్స్ ఓట్స్ తో త్రిగున్ నాలుగవ హౌస్ మెట్ అయ్యాడు. అందర్నీ విడివిడిగా గేమ్ ఆడాలి, గ్రూప్ గా కాదు అని చెప్పాడు నాగార్జున. షాలిని త్రిగున్ కి పనిష్మెంట్ ఇమ్మంటే ఆ పనిషమెంట్ నాగార్జున ఆమెకే ఇచ్చాడు. మాట్లాడకుండా, ఏడవకుండా ఒక రోజు ఉండాలని నాగార్జున పనిషమెంట్ ఇచ్చాడు. త్రిగున్ కి రోహిత్ ని కొన్ని మాటలు అన్నందుకు సారీ చెప్పమన్నాడు నాగ్. అలాగే ఒక టైర్ ఎత్తి నడవమని పనిషమెంట్ ఇచ్చాడు.
Also Read : Roja Daughter Anshu : షార్ట్ స్కర్ట్‌లో రోజా కూతురు.. అన్షు సెల్వమణి ఫొటోలు..
దేబ్జానీని తెలుగులోనే మాట్లాడుతున్నందుకు, అందరితో మంచిగా ఉన్నందుకు అభినందించాడు. రామ్ ప్రసాద్ ని అభినందించినాడు బాగా ఆడుతున్నందుకు. కానీ కామెడీగా షాలిని ని అన్న మాటని రివర్స్ అయిన సంగతి తెలిసిందే. కామెడీని జాగ్రత్తగా చేయమన్నాడు. దీనికి పనిష్మెంట్ గా ఒక బోర్డు మీద షాలినికి 500 సార్లు సారీ అని రాయమన్నారు. ఈ గ్యాప్ లో ముకేశ్.. రోహిత్ అన్న ఒక పదం నచ్చలేదు అని చెప్తే దాన్ని తీసుకోలేక ఎప్పట్లాగే రోహిత్ గొడవ పెట్టుకున్నాడు. అనంతరం శాలినిని హౌస్ మెట్ గా ప్రకటించాడు బిగ్ బాస్.
ఇక షాలిని రోహిత్ కి సపోర్ట్ తో నాగార్జునతో మాట్లాడింది. షాలిని చైత్ర హై రిస్క్ లో ఉన్నప్పుడు సాంగ్ అడిగిన దానికి నాగార్జున తిట్టాడు. అయినా షాలిని తాను తప్పు చేయలేదు అని వివరణ ఇచ్చుకోవడం మొదలుపెట్టింది. దాంతో షాలిని ని నాగార్జున యాటిట్యూడ్ మార్చుకోమన్నాడు.
అనంతరం అందర్నీ హార్ట్ కి ఎవరు దగ్గరగా, ఎవరు దూరంగా ఉన్నారు అని చెప్పమన్నాడు నాగార్జున. ఇందులో వర్షిణి.. దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, రోహిత్ కి హార్ట్ కి దూరంగా ఉన్నాడు అంది. దేబ్జానీ – రామ్ ప్రసాద్ హార్ట్ కి దగ్గరగా, రోహిత్ హార్ట్ కి దూరంగా ఉన్నాడు అంది. రోహిత్ – త్రిగున్ హార్ట్ కి దగ్గరగా, కృష్ణుడు హార్ట్ కి దూరంగా ఉన్నాడు అని చెప్పాడు. ఎప్పుడూ గొడవ పడే త్రిగున్ పేరు చెప్పి సింపతీ ట్రై చేసి సేఫ్ గేమ్ ఆడాడు.
త్రిగున్.. ఝాన్సీ హార్ట్ కి దగ్గరగా, సుధీర్ హార్ట్ కి దూరంగా ఉన్నారని చెప్పాడు. ఝాన్సీ.. ముకేశ్ హార్ట్ కి దగ్గరగా, రోహిత్ హార్ట్ కి దూరంగా ఉన్నాడని చెప్పింది. సృష్టి – దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, వర్షిణి హార్ట్ కి దూరంగా ఉందని చెప్పింది. మిగిలిన వాళ్ళతో రేపు ఆదివారం చెప్పేస్తాను అన్నాడు. చివరగా దేబ్జానీ హౌస్ మెట్ అయిందని ప్రకటించారు నాగార్జున. అనంతరం అందరికి బాయ్ చెప్పి రేపు కలుస్తాను అని చెప్పారు నాగ్. మొత్తానికి ఇవాళ రోహిత్, త్రిగున్, షాలినికి గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు నాగార్జున. రామ్ ప్రసాద్ ని కూడా కొంచెం హెచ్చరించాడు.
