ఎంతో ఉత్కంఠగా సాగిన Big Boss 13కి ఎండ్ కార్డు పడింది. ఫైనల్ విజేతను ప్రకటించారు. బాలికా వధు ఫేం సిద్ధార్థ్ శుక్లా మొదటి స్థానంలో నిలవగా..అసిమ్ రియాజ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఉద్వేగ భరితంగా ఈ కార్యక్రమం జరిగింది. ఫైనల్‌కు సిద్దార్థ్‌తో పాటు..నటుడు అసీం రియాజ్‌లు చేరుకున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 13కి హోస్ట్‌గా వ్యవహరించారు. తన వ్యాఖ్యలు, చేష్టలతో సల్మాన్ అందర్నీ అలరించారు.
కానీ బిగ్ బాస్ షో క్రియేటివ్ టీం మెంబర్ చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. విజేతగా నిలిచేందుకు అసీంకు అన్ని అర్హతలున్నా..అలా చేయలేదని క్రియేటివ్ టీంలో సభ్యురాలైన ఫెరీహ టెక్నీషియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేశారు. ఇదొక ఫిక్స్‌డ్ షో అంటూ ఆరోపణలు గుప్పించారు. దీని కారణంగా ఛానెల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు.
Read More : వారు జాతి వ్యతిరేకులు కారు..జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయంగా ప్రముఖుల నుంచి అసీంకు వస్తున్న మద్దతు చూడలేక, సిద్దార్థ్ గెలిచేలా వ్యూహాలు రచించారని మండిపడ్డారు. మహిళలపై పట్ల అనుచితంగా ప్రవర్తించిన సిద్ధార్థ్ విజేతగా ప్రకటించి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా, షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ, కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్ధార్థ్ డే, ఆర్తీ సింగ్, అసీం రియాజ్, అబూ మాలిక్, షఫాలీ బగ్గా, మహీరా శర్మ బిగ్ బాస్‌లో అడుగు పెట్టారు.
Throughout the show Siddharth Shukla abused & disrespected women, maligned their character, used violence, physically assaulted a female cont and the channel wants to crown him as the Winner.
What kind of example are we setting to the public here? Sad times !@ColorsTV #BiggBoss— Feriha (@ferysays) February 15, 2020