Bigg Boss 14: హౌస్‌లోకి రాధేమా ఎంట్రీ!..

  • Published By: sekhar ,Published On : September 30, 2020 / 12:52 PM IST
Bigg Boss 14: హౌస్‌లోకి రాధేమా ఎంట్రీ!..

Updated On : September 30, 2020 / 1:41 PM IST

Bigg Boss 14 – Radhe Maa Entery: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన టీవీ షో బిగ్‌బాస్(హిందీ) సీజన్-14 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇటీవల ఈ షోకు సంబంధించిన కొన్ని వీడియోలు విడుదల చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. సదరు ప్రోమోల్లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంతకుముందు కంటే ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.


కట్ చేస్తే మరో ప్రోమోలో ఇండియన్ స్పిరిట్యువల్ గురు Radhe Maa బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. రాధేమా బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశిస్తున్న బిగ్‌బాస్-14 ప్రోమో వీడియో అందరికీ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. షో ప్రారంభం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్‌లో కాసేపు కనిపిస్తారని, లేదు సల్మాన్‌తో కలిసి హోస్ట్ చేస్తారని మరికొందరు.. ఒకవేళ Radhe Maa షో లో పార్టిసిపేట్ చేస్తున్నారేమో అని ఇంకొందరు చర్చించుకుంటున్నారు.


ఇక ప్రోమోలో బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తున్న Radhe Maa ఎర్రని దుస్తులు ధరించారు. కాగా Radhe Maa అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. స్పిరిట్యువల్ గురుగా ఆమె పేరొందారు. నిత్యం భక్తుల మధ్య ఆమె నృత్యం చేస్తూ కనిపిస్తుంటారు. మరోవైపు Radhe Maa చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. బిగ్‌బాస్ 14 ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 3 శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.

https://www.instagram.com/p/CFuGlcUAWlX/?utm_source=ig_web_copy_link