రాళ్లే రత్నాలు.. బిగ్‌బాస్‌ హౌస్ లో రాళ్ల వర్షం

  • Publish Date - September 30, 2019 / 09:16 AM IST

బిగ్‌బాస్‌ హౌజ్‌లో అప్పుడే పదివారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈసారి బిగ్‌బాస్‌ పదకొండో వారం నామినేషన్‌ ప్రక్రియను కాస్త వెరైటీగా ఇచ్చాడు. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క ఇచ్చాడు. అంతేకాదు ఆ టాస్క్ తో పాటుగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని జీవనాన్ని గడపాల్సి ఉంటుంది.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఒక్కోసారి ఇంటిపై రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు రాళ్లను జమ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనా.. అనుకుంటున్నార ఇక్కడో చిన్న ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే.. ఇంటి సభ్యులు రాళ్లు జమ చేసుకుంటున్న సమయంలో సడెన్గా బజర్‌ మోగుతోంది. అలా బజర్ మోగిన ప్రతీసారి ఎవరి దగ్గరైతే ఎక్కువ రాళ్లు విలువైన రాళ్లు ఉంటాయో వారు నామినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు. తక్కువ విలువైన రాళ్లును సేకరించినవారు నామినేట్‌ అవుతారు. 

అయితే రవికృష్ణా ఓసారి ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. షో నుంచి ఎలిమినేట్ అయితే వెంటనే విజయవాడ వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తానని చెప్పాడు. అందుకని నాగార్జునా గారు రవికి విజయవాడ వెళ్లడానికి విమాన టికెట్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం హౌస్‌లో అలీ రెజా, రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, మహేష్, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు.