Bigg Boss 4: దివికి సినిమా ఆఫర్లు!..

  • Publish Date - October 6, 2020 / 03:30 PM IST

Bigg Boss 4 Contestant Divi Vadthya: మోడల్, నటి, దివి వాద్య్తా బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. హౌస్‌లో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ప్రేక్షకుల్లో కూడా అందరికంటే దివిపై మంచి గుడ్ విల్ ఉంది. దివి కచ్చితంగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది అని ధీమాగా చెబుతున్న వారు చాలామందే ఉన్నారు. అందరిలా అరవడాలు, ఓవరాక్షన్ చేయడం లాంటివి కాకుండా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేస్తూ ఎప్పుడూ నవ్వుతూ కళగా కనిపిస్తుంది దివి.


ఇప్పుడామెకు టాలీవుడ్ నుంచి భారీగా సినిమా ఆఫర్లు వస్తున్నాయనే వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. మోడల్‌గా కొన్ని యాడ్స్‌లో నటించిన దివి మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఓ సీన్‌లో కనిపించింది. తర్వాత వెబ్ సిరీస్ చేసింది కానీ అవి ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడామెకు పలు సినిమా, ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయట. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం గురించి నిర్ణయం తీసుకుంటుదట దివి..

ట్రెండింగ్ వార్తలు