Bigg Boss 5 : తెరపైకి కొత్త పేర్లు..కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి ?

బిగ్ బాస్ -5వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Bigboss

Bigg Boss 5 Telugu : బుల్లితెరపై ఎంతో సందడి సందడి చేసే ప్రోగ్రామ్స్ లలో బిగ్ బాస్ ప్రత్యేక స్థానం ఉంది. ఈ రియాల్టీ షో..బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు బిగ్ బాస్ -5వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ కు కూడా..టాలీవుడ్ మన్మథుడు ‘నాగార్జున’ హోస్ట్ గా అలరించనున్నారు.

Read More : AC 3-tier Coaches : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకే ఏసీ కోచ్‌ ప్రయాణం

సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ఈ షో ప్రసారం కాబోతోంది. వీకెండ్స్ అంటే శని, ఆదివారాల్లో మాత్రం 9 గంటలకే ప్రసారం కానుంది. అయితే..ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కడా వారి పేర్లను బయటకు రాకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు.

Read More : Lahari Shari : బిగ్ బాస్ హౌస్‌లోకి లహరి..?

ఫేమ్‌ ఉమాదేవి, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక, 7 ఆర్ట్స్ సరయు సుమన్, సింగర్‌ శ్రీరామచంద్ర, యాంకర్‌ రవి, యాంకర్‌ ప్రత్యూష, ఆట సందీప్ భార్య జ్యోతి, కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, యాంకర్ కమ్ నటి వర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, లోబో, నటి లహరి షారి, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, సిరి హన్మంత్‌, నవ్య స్వామి పేర్లు వినపడుతున్నాయి.

Read More : Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

ఇప్పటికే చెప్పేయండి బోర్ డమ్ కు గుడ్ బై అంటూ కింగ్ నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సెప్టెంబర్ 5 నుండి షో మొదలు కానుందని స్టార్ మా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కంటెస్టెంట్స్ లను ఎంపిక పూర్తి చేసి వారిని క్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఐటీసీకి చెందిన ఓ ప్రముఖ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచారు.

Read More : Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..

అయితే.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా ప్రచారం మొదలైంది. ఈ విషయంలో షో నిర్వాహకులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అనుకున్న టైంకి షో మొదలు పెడుతారా ? కోవిడ్ సోకిన వారి స్థానాల్లో ఇతరులను భర్తీ చేసి..షో మొదలు పెడుతారా ? అనేది తేలాల్సి ఉంది. మరి కంటెస్టెంట్స్ ఎవరనేది షో మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.