Bigg Boss 5 : నో సస్పెన్స్.. నేడే గ్రాండ్ ప్రీమియర్..

‘బిగ్ బాస్ 5’.. 15 వారాల పాటు సోమవారం – శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మరియు శని – ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది..

Bigg Boss 5 Premier

Bigg Boss 5: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ప్రీమియర్ నేడు ప్రారంభం కాబోతుంది. మూడు, నాలుగు సీజన్లు హోస్ట్ చేసి ఆకట్టుకున్న ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా తన హోస్టింగ్‌తో అదరగొట్టబోతున్నారు.

Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..

ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు అస్సలు బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు బిగ్ బాస్ యాజమాన్యం. ‘బోర్‌డమ్‌కి చెప్పండి గుడ్ బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ అంటూ ప్రోమోలతో హైప్ క్రియేట్ చేశారు.

Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..

ఫిలిం, టీవీ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్స్, ఒక రేడియో జాకీతో పాటు యూట్యూబ్ స్టార్స్ కూడా పార్టిసిపెట్ చేస్తున్నారని సమాచారం. ‘బిగ్ బాస్’ ఫార్మాట్, గ్లోబల్ స్థాయిలో సక్సెస్‌ఫుల్ నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో ఒకటి. ఇండియాలో 7 భాషల్లో 37 సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకుంది. 15 వారాల పాటు సోమవారం – శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మరియు శని – ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.