Bigg Boss 7 Day 25 Highlights Tasks for fourth Power Astra
Bigg Boss 7 Day 25 : బిగ్‌బాస్ నాలుగోవారం చప్పగా సాగుతుంది. ఒక్క నామినేషన్స్ తప్ప హౌస్ లో సందడి కనిపించట్లేదు. నాలుగో పవరాస్త్ర కోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్‌బాస్. దాని కోసం బజర్ గేమ్ పెట్టగా మొదట అమర్ దీప్ గౌతమ్ గెలిచారు. ఆ తర్వాత ఎలాగైనా గెలవాలని ప్రశాంత్ యావర్ బజర్ దగ్గరే కూర్చున్నారు. దీంతో యావర్ కి పలువురు కంటెస్టెంట్స్ కి మధ్య గొడవ మొదలైంది. అలా యావర్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, శివాజీల మధ్య గొడవలు అయ్యాయి.
అనుకున్నట్టు బజర్ ప్రెస్ చేసి ప్రశాంత్ యావర్ జట్టుగా ఆడతామన్నాడు. దీంతో బిగ్‌బాస్ కన్నీళ్లతో గ్లాసు నింపాలి అనే పిచ్చి టాస్క్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు. వీరికి ప్రత్యర్థి టీంగా అమర్ దీప్ గౌతమ్ లు ఉన్నారు. టాస్కులో ఎట్టకేలకు ప్రశాంత్ యావర్ గెలిచి నాలుగో పవరాస్త్ర కోసం ఇంకో రౌండ్ ముందుకి వెళ్లారు. దీంతో ఇప్పటివరకు టాస్కుల్లో గెలిచిన ప్రశాంత్, యావర్, తేజ, ప్రియాంకలకు హౌస్ లో ఉన్న వస్తువులతో వెరైటీగా రెడీ అయి ర్యాంప్ వాక్ చేయాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.
Also Read : Vishal : సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మార్క్ ఆంటోని రిలీజ్ అవ్వడానికి లంచం తీసుకున్నారంటూ..
దీంతో ఆ నలుగురు ర్యాంప్ వాక్ చేసి చూపించారు. ఈ నలుగురిలో ఎవరు నాలుగో పవరాస్త్ర గెలుచుకుంది నేటి ఎపిసోడ్ లో చెప్తాడు బిగ్‌బాస్. ఇక మరో వైపు శివాజీ మళ్ళీ హౌస్ లో ఉండలేను, వెళ్ళిపోతాను అంటూ రాగం ఎత్తుకున్నాడు. శివాజీ వచ్చిన రెండో వారం నుంచే హౌస్ లో ఉండను వెళ్ళిపోతాను అంటున్నాడు. గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున క్లాస్ పీకినా మళ్ళీ ఇప్పుడు అలాగే అంటున్నాడు. మరి బిగ్‌బాస్ శివాజీని ఇంటిలో నుంచి పంపించేస్తాడా చూడాలి.