×
Ad

Bigg Boss 7 Day 333 : బిగ్‌బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ ఎవరో తెలుసా?

కొన్ని గేమ్స్, త్యాగాల తరవాత శుక్రవారం ఎపిసోడ్ నాటికి తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ కెప్టెన్సీ టాస్కులో నిలిచారు.

  • Published On : October 7, 2023 / 10:45 AM IST

Bigg Boss 7 Day 33 Highlights who is the first Captain in Bigg Boss House

బిగ్‌బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ ఎవరో తెలుసా?

బిగ్‌బాస్ నాలుగు వారాలు పూర్తయి ఐదో వారం కూడా వీకెండ్ కి వచ్చేసింది. ప్రతి సీజన్ లోను మొదటి వారం నుంచే కెప్టెన్సీ టాస్కులు ఉంటాయి. కానీ ఈసారి నాలుగు వారాల తర్వాత కెప్టెన్సీ టాస్క్ లు మొదలు పెట్టారు. కెప్టెన్సీ కోసం ఉన్న కంటెస్టెంట్స్ కి రకరకాల గేమ్స్, టాస్కులు పెట్టారు. కొన్ని గేమ్స్, త్యాగాల తరవాత శుక్రవారం ఎపిసోడ్ నాటికి తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ కెప్టెన్సీ టాస్కులో నిలిచారు.

చివరగా ఈ నలుగురికి రంగు పడుద్ది రాజా అనే టాస్క్ ఇచ్చారు. ఓ సర్కిల్ లో నలుగురిని పెట్టి కొన్ని రంగులు పెట్టి ఆ రంగులతో ఒకరి షర్ట్ పై ఒకరు పూస్తూ తమపై రంగు పడకుండా తమని కాపాడుకోవాలి. ఇచ్చిన టైంలో ఎవరి షర్ట్ పై అందరికంటే ఎక్కువ రంగు వాళ్ళు టాస్క్ నుంచి అవుట్ అవుతారు. మొదట తేజ లైన్ దాటేసాడని టాస్క్ నుంచి పంపించేశారు. ఆ తర్వాత బజర్ మోగే లోపు సందీప్ ఒంటిపై ఎక్కువ ఉండటంతో అతన్ని పంపించేశారు. ఆ తర్వాత గౌతమ్, ప్రశాంత్ లో ఇద్దర్ని పరిశీలించి సంచలాక్ ప్రియాంక ప్రశాంత్ ని కెప్టెన్ గా ప్రకటించింది. దీంతో బిగ్‌బాస్ అతనికి కెప్టెన్సీ బ్యాడ్జ్ ని పంపించాడు.

Also Read : Bigg Boss 7 : ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. మరో ప్రేమ కహాని షురూ..

ఇక ఎప్పటిలాగే శివాజీ ప్రశాంత్ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. గేమ్ లో భాగంగా సందీప్ మాస్టర్ అందరితో గొడవ పడ్డాడు. మరి కెప్టెన్ గా విన్ అయినా ప్రశాంత్ ఏం చేస్తాడో చూడాలి.