Bigg Boss 7 Day 44 Highlights Bhole Shivali Vs Shobha Shetty and Priyanka
Bigg Boss 7 Day 44 : బిగ్‌బాస్ ఆరు వారాలు పూర్తయింది. ఏడోవారంలోకి రాగానే నామినేషన్స్ ఎపిసోడ్ ని షురూ చేశారు. ఈ వారం నామినేషన్స్ కొంచెం వేడివేడిగానే జరిగాయి. కంటెస్టెంట్స్ ఒకర్నొకరు తిట్టుకునేదాకా వెళ్లారు. సోమవారం మధ్యలో ఆగిన నామినేషన్స్ నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలినవి పూర్తి చేశారు.
ఈ నామినేషన్స్ లో శోభాశెట్టి.. తేజ, భోలె శివాలిలను నామినేట్ చేసింది. శివాజీ.. గౌతమ్, అమరదీప్ లను. అశ్విని.. పూజామూర్తి, అర్జున్ లను, గౌతమ్.. భోలె, శివాజీలను, భోలె.. శోభాశెట్టి, ప్రియాంకలను, యావర్.. గౌతమ్, అమరదీప్ లను, ప్రశాంత్.. సందీప్, తేజలను, అమరదీప్.. భోలె, అశ్వినిలను, పూజామూర్తి.. భోలె, అశ్వినిలను, సందీప్.. భోలె, ప్రశాంత్ లను, అర్జున్.. భోలె, అశ్వినిలను, ప్రియాంక.. అశ్విని, భోలెలను, తేజ.. పూజా, ప్రశాంత్ లను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో.. భోలె శివాలి, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా మూర్తి, అమరదీప్, గౌతమ్ లు నిలిచారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
ఇక నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగగా, ఎక్కువగా భోలే – శోభాశెట్టి, ప్రియాంకల మధ్య జరిగాయి. భోలే ప్రతిదీ సిల్లీగా తీసుకొని మాట్లాడటంతో శోభాశెట్టి, ప్రియంకలకు బాగా మండింది. దీంతో ఇద్దరూ ఫైర్ అయ్యారు. ఇక భోలే.. ఆడపిల్ల కదా పాపం అని వదిలేస్తున్నాను అనడంతో ఇంకా ఫైర్ అయ్యారు. భోలే ఎంత కూల్ గా ఉన్నా శోభా, ప్రియాంకలు ఫైర్ అవ్వడంతో సహనం కోల్పోయి తిట్టేసాడు. దీంతో ఇద్దరికీ ఏం చేయాలో తెలియలేదు. మధ్యలో బిగ్‌బాస్ ఎంటర్ అయి భూతులు తిడుతున్నావని భోలేకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భోలే వచ్చే వారమే వెళ్ళిపోతాను, మీరు హ్యాపిగా ఉండండి అంటూ పక్కకి వెళ్ళిపోయాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో భోలే వర్సెస్ శోభాశెట్టి, ప్రియాంకల రచ్చ సాగింది.