Bigg Boss 7 Day 49 : మళ్ళీ లేడి కంటెస్టెంట్ అవుట్.. ఇంకో లేడి కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. ఏంటో ఈసారి బిగ్‌బాస్..

బిగ్‌బాస్ హౌస్ లో వరుసగా ఏడో సారి కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇదే మొదటిసారి బిగ్‌బాస్ చరిత్రలో.

Bigg Boss 7 Day 49 Highlights Pooja Murthy Eliminated and Rathika Rose Re entry

Bigg Boss 7 Day 49 : బిగ్‌బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్, దసరా ఎపిసోడ్ ఒకేసారి చేసేశారు. శనివారం కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయిన నాగార్జున ఆదివారం నాడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మొదట హౌస్ లో ఉన్నవాళ్ళని రెండు టీమ్స్ గా విడగొట్టి వాళ్లకి గేమ్స్ పెట్టాడు. అలాగే దసరా ఎపిసోడ్ కావడంతో హీరోయిన్స్ రెబా మోనికా, పాయల్ రాజ్ పుత్, డింపుల్ హయతిలతో స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు చేయించారు. అనంతరం పలువురు సింగర్స్ వచ్చి తమ పాటలతో అలరించారు.

హౌస్ లో ఉన్న శోభా, యావర్ కి ఇంటి వద్ద నుంచి లెటర్స్ వచ్చాయని చెప్పి ఇవ్వడంతో ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులని తీసుకొచ్చి వాళ్ళతోనే సేవ్ అయినట్టు చెప్పించాడు నాగార్జున. కుటుంబ సభ్యులు కనపడటంతో మిగిలిన వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక నామినేషన్స్ లో ఉన్న అమర్ దీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్, భోలే సేవ్ అవ్వగా చివరగా పూజా మూర్తి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వడం విశేషం.

అయితే బిగ్‌బాస్ హౌస్ లో వరుసగా ఏడో సారి కూడా మహిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇదే మొదటిసారి బిగ్‌బాస్ చరిత్రలో. అయితే ఈసారి ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వగా ఇంకో లేడీ కంటెస్టెంట్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ నుంచి నాలుగో వారం వెళ్లిపోయిన అందాల భామ రాతిక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. శుభశ్రీ రీ ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు కానీ రతిక రావడంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.

Also Read : Prabhas : వామ్మో ప్రభాస్ కటౌట్ ఎంత భారీగా ఉందో.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఏ హీరోకి ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదుగా..

ఇక హౌస్ లో బతుకమ్మ, దసరా సెలబ్రేషన్స్ నిర్వహించగా కంటెస్టెంట్స్ అంతా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. మరి రతిక రీ ఎంట్రీ తర్వాత హౌస్ లో పరిస్థితులు ఎలా మారతాయి నేటి ఎపిసోడ్ నుంచి చూడాలి.