Prabhas : వామ్మో ప్రభాస్ కటౌట్ ఎంత భారీగా ఉందో.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఏ హీరోకి ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదుగా..

తాజాగా సలార్ చిత్రయూనిట్, కొంతమంది అభిమానులు కలిసి ప్రభాస్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

Prabhas : వామ్మో ప్రభాస్ కటౌట్ ఎంత భారీగా ఉందో.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఏ హీరోకి ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదుగా..

Salaar Movie Unit and Prabhas Fans placed a Huge Cutout in Hyderabad

Updated On : October 23, 2023 / 9:56 AM IST

Prabhas : బాహుబలి(bahubali) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచేసి ఇండియన్ సినిమాగా మార్చేశాడు ప్రభాస్. తెలుగు సినిమాలకు ఇండియా అంతటా, విదేశాల్లో మరింత పెద్ద మార్కెట్ ఏర్పడేలా చేసాడు ప్రభాస్. నేడు ఈ బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక పలువురు అభిమానులు ప్రభాస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

తాజాగా సలార్ చిత్రయూనిట్, కొంతమంది అభిమానులు కలిసి ప్రభాస్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి లోని ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో నిన్న సాయంత్రం ప్రభాస్ 230 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. సలార్ స్టైల్ తో ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నిన్న సాయంత్రం ఈ కటౌట్ ఓపెనింగ్ కి అభిమానులు భారీగా వచ్చి సందడి చేశారు. చాలా దూరం నుంచి కూడా ఈ కటౌట్ కనిపిస్తుండటంతో ప్రభాస్ కటౌట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read : Prabhas Fans : జపాన్‌లో ప్రభాస్ అభిమానుల హంగామా.. ప్రభాస్‌కి ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి..

సాధారణంగా అభిమానులు తమ హీరో సినిమాల రిలీజ్ ల సమయంలో థియేటర్స్ వద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి హంగామా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి పెట్టలేదు. దీంతో ప్రభాస్ కటౌట్ వైరల్ అవుతుంది.