Bigg Boss 7 Day 82 : బిగ్‌బాస్ సీజన్ 7 చివరి కెప్టెన్ ఎవరు..?

బిగ్‌బాస్ సీజన్ 7 చివరి కెప్టెన్ ఎన్నికయ్యాడా..? శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది..?

Bigg Boss 7 Day 82 Highlights last captain of season seven

Bigg Boss 7 Day 82 : బిగ్‌బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజులు ఈ సీజన్ ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో పది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారు. వీరిలో మొత్తం 8 మంది ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. శివాజీ, ప్రశాంత్‌ సేఫ్ లో ఉండగా ప్రశాంత్, శోభాశెట్టి, గౌతమ్, ప్రియాంక, యావర్, రతిక, అశ్విని, అమర్, శివాజీ, అర్జున్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఇది ఇలా ఉంటే, ఈ వారంతో కెప్టెన్సీ టాస్క్ ముగుస్తుందని నాగార్జున చెప్పారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 7 చివరి కెప్టెన్ ఎవరు అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అశ్విని, రతిక, అమర్ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు. అయితే వీరిలో అమర్ కెప్టెన్ అవ్వాలని చాలా ఆశ పడ్డాడు. హౌస్ లోని ప్రతి ఒక్కరిని తనని కెప్టెన్ చేయమని వేడుకున్నాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ఇక కెప్టెన్సీ కోసం పెట్టిన టాస్క్ ఏంటంటే.. బిగ్‌బాస్ రెండు ఫోటోలు చూపిస్తాడు. జట్టుగా ఉన్న ఇద్దరు హౌస్‌మేట్స్ ఒక నిర్ణయానికొచ్చి.. ఒకర్ని సేవ్ చేయాలి, ఒకర్ని షూట్ చేయాలి.

Also read : Vijay Sethupathi : హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు.. డైరెక్టర్ ఎవరంటే?

ఇలా అందరు తమ నిర్ణయాన్ని చెప్పగా, జట్టుగా ఉన్న శోభా, శివాజీ.. అమర్ అండ్ అర్జున్ లో ఒకరిని నిర్ణయించుకోవాల్సి ఉంది. శోభా అమర్ పేరు చెప్పగా, శివాజీ అర్జున్ పేరు చెప్పాడు. ఈ ఇద్దరు ఒక మాట మీదకి రావడానికి చాలా చర్చ జరిగింది. ఒక పక్క అమర్ తనని కెప్టెన్ చేయమని బోరున ఏడుస్తూ కూర్చున్నాడు. ఏ నిర్ణయం త్వరగా చెప్పకపోతే కెప్టెన్సీ టాస్క్ కూడా క్యాన్సిల్ చేస్తామని బిగ్‌బాస్ హెచ్చరించాడు. దీంతో చివరాఖరికి శివాజీ, శోభా ఒక మాట మీదకి వచ్చి అర్జున్ పేరుని చెప్పారు.

కానీ అప్పటికే టాస్క్ సమయం అయ్యిపోయింది, ఎపిసోడ్ అయ్యిపోయింది. దీంతో చివరి కెప్టెన్ ఎవరు అన్నది తెలియలేదు, అసలు కెప్టెన్ టాస్క్ ఉందా? క్యాన్సిల్ అయ్యిందా? అనేది కూడా సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ వారం ఉన్న నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ లో రతిక, అశ్విని ఎలిమినేట్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉందని చెబుతున్నారు.