Pallavi Prashanth: బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదల.. ఫ్యాన్స్ మళ్లీ భారీగా వచ్చి..

నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్నారు పల్లవి ప్రశాంత్. చంచల్ గూడా జైలు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.

Bigg Boss 7 Winner Pallavi Prashanth

Pallavi Prashanth: హైదరాబాద్‌లోని చంచల్ గూడా జైలు నుంచి బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్నారు పల్లవి ప్రశాంత్. చంచల్ గూడా జైలు వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ గుమిగూడి ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. దీంతో ఇవాళ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యారు. బిగ్‌బాస్ 7 ముగిశాక పల్లవి ప్రశాంత్ వ్యవహారం అలజడి రేపిన విషయం విదితమే.