Bigg Boss 8 : నాగ మణికంఠ ఎలిమినేట్..? ఆరోగ్య సమస్యలతో.. పంపించేయండి అంటూ ఏడుస్తూ..

ఈ వారం నాగ మణికంఠనే వెళ్ళిపోతాను అని అడిగి వెళ్ళిపోతున్నాడని తెలుస్తుంది.

Bigg Boss 8 Naga Manikanta will Eliminate this Week with Health Issues Rumours goes Viral

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏడో వారం నేడు ముగియనుంది. ఇప్పటికే 7 గురు ఎలిమినేట్ అయి మరికొంతమంది వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్స్ లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, ప్రేరణ, హరితేజ.. తొమ్మిది మంది ఉన్నారు. అయితే బిగ్ బాస్ లీకుల సమాచారం ప్రకారం ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అవుతాడని సమాచారం.

షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో యూట్యూబ్ లో పేరు తెచ్చుకున్న నాగమణికంఠ బిగ్ బాస్ లోకి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర్నుంచి ఎమోషనల్ డ్రామాతోనే నెట్టుకొచ్చాడు. కానీ ఆ ఎమోషన్ తోనే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు. అందుకే ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగాడు. అయితే ఈ వారం నాగ మణికంఠనే వెళ్ళిపోతాను అని అడిగి వెళ్ళిపోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Anasuya Vs Manchu Lakshmi : అణుబాంబ్ వర్సెస్ లక్ష్మి బాంబ్.. అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి..

హౌస్ లోనే నిన్నటి ఎపిసోడ్ లో కెమెరా ముందుకు వచ్చి.. ఈ గొడవలు, కొట్లాటలు నా వల్ల కావట్లేదు నన్ను పంపించేయండి, ప్రేక్షకులు నాకు ఓట్లు వేయకండి అంటూ ఏడ్చాడు నాగమణికంఠ. ఇక నిన్న శనివారం కావడంతో నాగార్జున కూడా రాగా నాగార్జునతో నాగ మణికంఠ.. ఫ్యామిలీ వీక్ వరకు ఉందాము అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఇంకా ఆడాలని ఉన్నా నా శరీరం, నా మైండ్ సహకరించట్లేదు. నేను వీక్ అయిపోయాను నేను వెళ్ళిపోతాను సర్ అని ఎమోషనల్ అయి అన్నాడు.

అయితే నాగార్జున రేపటి వరకు ఆగు ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం అన్నాడు. దీంతో ఈ వారం నాగమణికంఠని బిగ్ బాస్ నుంచి పంపించేసినట్టు తెలుస్తుంది. ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా నాగ మణికంఠనే ఆరోగ్య సమస్యలతో, ఒంటరితనం ఫీలయ్యి అడిగి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి అధికారికంగా తెలియాలంటే ఇవాళ రాత్రి ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే.