Anasuya Vs Manchu Lakshmi : అణుబాంబ్ వర్సెస్ లక్ష్మి బాంబ్.. అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి..

దీపావళి ప్రోగ్రాం కోసం మంచు లక్ష్మిని, అనసూయని స్పెషల్ గా పిలిపించి అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి అన్నట్టు..

Anasuya Vs Manchu Lakshmi : అణుబాంబ్ వర్సెస్ లక్ష్మి బాంబ్.. అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి..

Anasuya Vs Manchu Lskhmi in Deepavali Special Program Promo goes Viral

Updated On : October 20, 2024 / 9:09 AM IST

Anasuya Vs Manchu Lakshmi : ప్రతి పండక్కి పలు టీవీ ఛానల్స్ స్పెషల్ ఈవెంట్స్ చేస్తాయని తెలిసిందే. అయితే ఈ దీపావళికి ఈటీవి ఛానల్ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేయనుంది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది అనే పేరుతో దీపావళి స్పెషల్ ఈవెంట్ చేయనున్నారు. ఇప్పటికే షూట్ అయిపోగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.

ఈసారి ఈ ఈవెంట్ కొత్తగా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ దీపావళి ప్రోగ్రాం కోసం మంచు లక్ష్మిని, అనసూయని స్పెషల్ గా పిలిపించి అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి అన్నట్టు స్క్రిప్ట్ రాసుకున్నారు. అనసూయని అణుబాంబ్ అని, మంచు లక్ష్మిని లక్ష్మి బాంబ్ అని సరదాగా చెప్పించి వీరిద్దరి మధ్య ఫైట్ అన్నట్టు ప్రోమో డిజైన్ చేసారు. ఇక ఎప్పట్లాగే స్కిట్స్, సాంగ్స్, డ్యాన్సులు ఉండబోతున్నాయి. శ్రీముఖి ఈ ప్రోగ్రాంకి హోస్ట్ చేసింది. యూట్యూబర్ షణ్ముఖ్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు.

Also Read : Allu Sneha Reddy : తెల్లవారుజామునే లేచి అట్లతద్ది చేసుకున్న అల్లు అర్జున్ భార్య.. ఫొటోలు షేర్ చేసి..

ప్రోమో ఆసక్తిగా ఎంటర్టైనింగ్ గా సాగింది. దీంతో ఈ దీపావళి ప్రోగ్రాం ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి మంచు లక్ష్మి,అనసూయ కలిసి ఈ ప్రోగ్రాంలో ఎంత రచ్చ చేసారో దీపావళి రోజు చూడాలి. మీరు కూడా ప్రోమో చూసేయండి..