Bigg Boss 8 ninth week Nayani Pavani eliminated
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో తొమ్మిది వారంలో నయని పావని ఎలిమినేట్ అయింది. నామినేషన్‌లో ఆఖరి వరకు హరితేజ, నయని లు ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి నయని పావని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పేశారు. దీంతో తొమ్మిది వారాల్లో 9 మంది.. బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్, నయని పావనిలు ఎలిమినేట్ అయ్యారు.
ఎలిమినేట్ కావడంతో నయని పావని స్టేజీ పైకి వచ్చింది. తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. ఆ తరువాత హౌస్‌లో ఉన్న వాళ్లలో ముగ్గురు బెస్ట్ ప్లేయర్లు, ఐదుగురు డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు.
హరితేజ, నిఖిల్, పృథ్వీలను బెస్ట్ ప్లేయర్లు అని నయని చెప్పింది. ఇక గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియలను డమ్మీ ప్లేయర్లు అని తెలిపింది. వయసు రీత్యా గంగవ్వకు ఆడడం కష్టం అని అంది. ప్రేరణను కోపం ఎక్కువని, ఆమె మాటల వల్ల ఎదుటివాళ్లు బాధపడుతున్నారని అదే ప్రేరణకు నెగెటివ్‌గా మారుతుందని అంది.
విష్ణుప్రియలో గేమ్ బాగా ఆడుతుందని, అయితే.. ఇప్పుడు ఆడలేక డమ్మీ ప్లేయర్‌గా మిగిలిపోతుందని తెలిపింది. రోహిణి బాగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇక గౌతమ్ గురించి మాట్లాడుతూ.. ఒకరి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో మనం కూడా అదే ఇవ్వాలని అంది.
NTR – Venkatesh : ఎన్టీఆర్ కొడుకులతో సరదాగా వెంకీ మామ.. వీడియో చూశారా..?