Chiranjeevi : ఆ సినిమాకు చిరంజీవి గారికే ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చేది.. కానీ.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

తెలుగు నుంచి మొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేసారు.

Chiranjeevi : ఆ సినిమాకు చిరంజీవి గారికే ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చేది.. కానీ.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

Producer Yedida Sriram Sensational Comments on National Best Actor Award Regarding Chiranjeevi

Updated On : November 3, 2024 / 9:46 PM IST

Chiranjeevi : పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు నుంచి మొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేసారు. అయితే అల్లు అర్జున్ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవికి రావాల్సింది కానీ రాలేదు అంటూ ఓ నటుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : NTR – Venkatesh : ఎన్టీఆర్ కొడుకులతో సరదాగా వెంకీ మామ.. వీడియో చూశారా..?

ఒకప్పటి స్టార్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు, నటుడు, నిర్మాత ఏడిద శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి గారికి ఆపద్బాంధవుడు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చేది. ఇక ప్రకటిస్తారు అనగా నార్త్ – సౌత్ అనే తేడాతో చివరి నిమిషంలో నార్త్ వాళ్లకు ఇచ్చుకున్నారు. లేకపోతే తెలుగులో మొట్టమొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయనకే వచ్చేది అని అన్నారు. దీంతో ఏడిద శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు సినిమాలో చిరు నటనతో ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మించింది కూడా ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలోనే. ఇప్పుడు ఆయన కొడుకు ఏడిద శ్రీరామ్ చిరంజీవికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు మిస్ అయింది అనడంతో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి.