Bigg Boss 8 : వెళ్లిపో అంటూ ఏడ్చిన కిరాక్ సీత‌.. సోనియాతో నిఖిల్ గొడ‌వ‌..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో మూడో వారం చివ‌రికి వ‌చ్చేసింది.

Bigg Boss 8 Who will be the next contender

Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో మూడో వారం చివ‌రికి వ‌చ్చేసింది. ఈ వారం గొడ‌వ‌లు, కొట్టుకోవ‌డం, జ‌ట్టు పీక్కోవ‌డం వంటివి చోటు చేసుకున్నాయి. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో 2ను విడుద‌ల చేశారు. తిన్న‌వా అని సోనియాను నిఖిల్ అడుగాడు. నీకు అంత ఉంటే తినేట‌ప్పుడు అడ‌గాల్సిందిగా అంటూ కాస్త కోపంగా చెప్పింది సోనియా.ఇది చూస్తుంటే.. ఏదో విష‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లుగా అనిపిస్తోంది.

ఇక రెడ్ ఎగ్ గురించి బిగ్‌బాస్ రిలీల్ చేశాడు. రెడ్ ఎగ్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉందో చెప్పాల‌ని కోరాడు. నిఖిల్ త‌న ద‌గ్గ‌ర ఉంది అని చెప్పాడు. ఆ రెడ్ ఎగ్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉంటే వాళ్లు క్లాన్ చీఫ్ కంటెండ‌ర్‌ అవుతార‌ని చెప్పాడు. ఎవ‌రికి ఇవ్వాల‌ని అనుకుంటున్నావు అని అడుగ‌గా.. సోనియాకు ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. చీఫ్ పోస్ట్‌కు తాను కంటెండ‌ర్ కావ‌డంతో సోనియా తెగ ఆనంద ప‌డిపోయింది.

Jani Master : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్ట‌ర్‌కు షాక్‌.. 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌

ఇక మ‌ణికంఠ త‌న‌లో తానే మాట్లాడుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అంద‌రికి ఇదో గుణ‌పాఠం అవుతుందేమోన‌ని అన్నాడు. మ‌రోవైపు కిరాక్ సీత బెడ్ ప‌డుకుని ఏడుస్తుంది. అప్పుడు నిఖిల్ రాగా.. ఎక్కువ చేస్తున్నావ్ వెళ్లిపో.. లేదంటే నేను వెళ్లిపోతాను అని అంది. ఆ త‌రువాత తాను లేచివెళ్లిపోతుండ‌గా.. నిఖిల్ అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డంతో ప్రొమో పూర్తి అయింది. చూస్తుంటే రెడ్ ఎగ్ త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా అనిపిస్తోంది.