Nikhil Maliyakkal
Nikhil Maliyakkal : గోరింటాకు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ బిగ్ బాస్ షోతో మరింత వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచి నిఖిల్ పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం నిఖిల్ పలు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు, సిరీస్ లు ప్లాన్ చేస్తున్నాడు.(Nikhil Maliyakkal)
తాజాగా నిఖిల్ మలియక్కల్ హీరోగా ఓ ప్రాజెక్టు టీజర్ రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవ్వనుంది. విక్రమ్ ఆన్ డ్యూటీ అనే టైటిల్ తో ఈ టీజర్ రిలీజ్ అయింది. అయితే ఇది సినిమానా లేక వెబ్ సిరీస్ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ టీజర్ తో నిఖిల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also See : Eeshaa Rebba : ఫ్యామిలీతో కలిసి తిరుమలను సందర్శించిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఫొటోలు..
త్వరలోనే విక్రమ్ ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు. మీరు కూడా నిఖిల్ మలియక్కల్ హీరోగా చేసిన విక్రమ్ ఆన్ డ్యూటీ టీజర్ చూసేయండి..