×
Ad

Bigg Boss 9 Telugu : నాన్న ఎలిమినేట్ అయ్యాడు.. ఇమ్మూ ఎంత ప‌ని చేశావ్‌.. ఇప్పుడు త‌నూజ ప‌రిస్థితి ఏంటో..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 (Bigg Boss 9 Telugu) ఆరో వారంలో భ‌ర‌ణి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

Bigg Boss 9 Telugu Bharani eliminated in six week

Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో న‌టుడు భ‌ర‌ణి ఎలిమినేట్ అయ్యాడు.

ఆరో వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ (Bigg Boss 9 Telugu) దివ్య నిఖిత, పవన్ డిమోన్, భరణి శకంర్, రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒక్కొక్క‌రు సేవ్ అవుతూ వ‌చ్చారు. చివ‌రికి డేంజ‌ర్ జోన్‌లో రాము రాథోడ్‌, భ‌ర‌ణి లు నిలిచారు.

ఈ ఇద్ద‌రిలో ఎవరికైనా నీ ద‌గ్గ‌ర ఉన్న పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని ఇమ్మాన్యుయేల్‌ను నాగార్జున అడిగారు. దీనికి ఇమ్మూ ఇలా స‌మాధానం చెప్పాడు. ఆరువారాల ఆట ప్రకారం తాను రాము రాథోడ్‌ను సేవ్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఇక ప్రేక్ష‌కుల ఓటింగ్ ద్వారా కూడా భ‌ర‌ణినే ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించాడు.

Parineeti Chopra Baby Boy: పండుగ వేళ.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

భ‌ర‌ణి డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ప్పుడే దివ్య, త‌నూజ భావోద్వేగానికి గురి అయ్యారు.ఇక నాన్న వెళ్లిపోతుంటే ఈ ఇద్ద‌రు వెక్కి వెక్కి ఏడ్చారు.

ఇక హౌస్ నుంచి స్టేజీ పైకి వ‌చ్చిన భ‌ర‌ణి.. ‘నీకు ఒక‌టే చెబుతున్నా.. ఎవ‌రిని న‌మ్మ‌కు, ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కు, నీకు తోచిన‌ట్లు ఆడు ఏడ‌వ‌కు.’ అని త‌నూజ‌కు చెప్పాడు. ఇక‌ ఇమ్మాన్యుయేల్‌ తో ఇలా అన్నాడు. ‘ఇక్క‌డ మ‌నం అడుగుపెట్టిన రోజు నుంచి ఒకే మాట మ‌నం అనుకుంటూ వ‌స్తున్నాం. ఆ మాట నువ్వు నిల‌బెట్టాలి. నువ్వు నీలాగా ఉండు.’ అని అన్నాడు.