×
Ad

Bigg Boss 9 Telugu : రేపే బిగ్ బాస్ ఫైనల్.. ప్రభాస్ – చిరంజీవి ఫైనల్ గెస్ట్ ఎవరు..? ఫ్యాన్స్ గెట్ రెడీ..

ప్రతిసారి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరో ఒకరు గెస్ట్ ని తీసుకొస్తారని తెలిసిందే.(Bigg Boss 9 Telugu)

Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. రేపు ఆదివారమే బిగ్ బాస్ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం టాప్ 5లో తనూజ, కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. తనూజ బిగ్ బాస్ గెలుస్తుందని భావిస్తున్నారు. మరి చివరి నిమిషంలో ఈ అయిదుగురిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 గెలుస్తారో చూడాలి. అయితే ప్రతిసారి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరో ఒకరు గెస్ట్ ని తీసుకొస్తారని తెలిసిందే.(Bigg Boss 9 Telugu)

ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కి చిరంజీవి లేదా ప్రభాస్ గెస్ట్ గా వస్తారని ప్రచారం జరుగుతుంది. రాజాసాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రమోషన్స్ కి రాడని, అందులోను ఇలా టీవీ షోలకు అస్సలు వెళ్లడని తెలిసిందే. ప్రభాస్ వస్తాడు అనేది కేవలం సోషల్ మీడియా ప్రచారమే.

Also See : Pranavi Manukonda : తిరుమలలో నటి ప్రణవి మానుకొండ.. ఫొటోలు చూశారా..?

బిగ్ బాస్ రూమర్స్ ప్రకారం ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారని సమాచారం. ఆల్రెడీ గతంలో చిరంజీవి బిగ్ బాస్ సీజన్ 3, 4 ఫైనల్స్ కి గెస్ట్ గా వచ్చారు. ఈసారి మన శంకరవరప్రసాద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ షోకి వస్తాడని, ఎలాగో నాగార్జున – చిరంజీవి బాగా క్లోజ్ కాబట్టి నాగ్ మెగాస్టార్ ని తీసుకొస్తారని సమాచారం. దీంతో రేపు జరగనున్న బిగ్ బాస్ ఫైనల్ కి చిరంజీవి గెస్ట్ గా వస్తాడని టాక్ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్, మరో వైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ హీరో వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.